తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది: పవన్ కళ్యాణ్

తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల తీర్పును పవన్ కళ్యాణ్ ప్రశంసించారు.

ఈ మేరకు జనసేన పార్టీ అధికారికంగా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీష్ రావును సైతం అభినందలతో ముంచెత్తడం గమనార్హం.

తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది

తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన గౌరవనీయులు కె.చంద్రశేఖర్ రావుగారికి నా తరుపున, జనసేనప శ్రేణుల తరుపున హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది.

తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కే పట్టం

తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కే పట్టం

తెలంగాణ కోసం త్యాగాలు చేసిన, తెలంగాణను తెచ్చిపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితికి, ఆ పార్టీ నాయకుడు కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టి తమ మనసులోని మాటను మరోసారి చాటి చెప్పారు... అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

 మీ ఇద్దరి సారథ్యంలోనే..

మీ ఇద్దరి సారథ్యంలోనే..

ఈ అఖండ విజయానికి సారధులైన కేసీఆర్ గారికి, ఆయన కుమారుడు కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను కేసీఆర్ గారు నెరవేరుస్తారన్న నమ్మకం నాలో సంపూర్ణంగా ఉంది.

హరీష్ రావు గురించి...

ఈ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపుపొందిన శ్రీ హరీష్ రావు గారికి నా శుభాకాంక్షలు. విజయం సాధించిన ప్రతి ఒక్కరితో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు నా అభినందనలు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X