Janani వేరే లెవల్.. ఆకట్టుకుంటున్న RRR థర్డ్ సింగిల్.. కొత్త బాధ్యత తలకెత్తుకున్న కీరవాణి!

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సినిమా అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా జనని అనే సాంగ్ విడుదల చేశారు. ఆ సాంగ్ ఎలా ఉంది? ఏ వివరాల్లోకి వెళితే..

పిరియాడిక్ యాక్షన్ డ్రామా

పిరియాడిక్ యాక్షన్ డ్రామా

ఆర్ ఆర్ ఆర్ పేరుతో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలలో నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, సముద్ర ఖని కీలక పాత్రలలో నటిస్తుండగా నటీ ఒలివియా మోరిస్, నటి అలియా భట్ లు హీరోయిన్లుగా ఈ సినిమా రూపొందుతోంది.

 జనవరి 7న

జనవరి 7న

ముందు దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా.. ఫైనల్‌గా సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సినిమా ప్రమోషన్ కోసం యూనిట్ కొత్తగా దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి మల్టీప్లెక్స్ దిగ్గజం పివిఆర్ సినిమాస్‌తో చేతులు కలుపి ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించింది.

భారీగానే అంచనాలు

భారీగానే అంచనాలు

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ముందు నుంచి భారీగానే అంచనాలు ఉన్నాయి. భారీ స్థాయి బడ్జెట్, రెండు కుటుంబాలకు చెందిన హీరోలు నటిస్తూ ఉండడం, స్టార్ నటీనటులు భాగం కావడమే కాక బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ కు చెందినా కొందరు ఫేమస్ యాక్టర్స్ నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

 జనని

జనని

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి అనడంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇటీవల విడుదలైన నాటు నాటు వీర నాటు సాంగ్ ఇప్పటికీ నెట్టింట్లో ట్రెండ్ అవుతూనే ఉంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి జనని అనే పాటను విడుదల చేశారు. ఈరోజు నాలుగు గంటలకు ఈ పా విడుదల చేస్తామని చెప్పినా ఎందుకో గంట ముందే విడుదల చేశారు.

Recommended Video

Latest Tollywood Updates : Allu Arjun ఖాతాలో ఓ అరుదైన రికార్డు..! || Filmibeat Telugu
వేరే లెవల్ కు తీసుకెళ్ళిన జనని

వేరే లెవల్ కు తీసుకెళ్ళిన జనని

ఇక ఈ పాట గురించి చెప్పాలంటే సినిమా ఆత్మను చూపించారు. అద్భుతమైన విజువల్స్ తో సాగిన ఈ పాటలో ఇద్దరు హీరోలు పోరాటం చేయడం చూపించారు. అజయ్ దేవగన్, తారక్, చరణ్, శ్రియ, అలియా భట్ లు ఈ పాటలో కనిపింఛారు. బ్రిటీష్ పాలకులు మనపై చేసిన దాడులు చూపించారు. అసలు ఈ పోరాట యోధులు పోరాటం చేయడానికి ఎందుకు కంకణం కట్టుకున్నారు? వారు అంతలా ఎంధుకు ప్రభావితం అయ్యారు? కళ్ళముందు ఎలాంటి దాడులు జరిగాయి? అనేది ఈ పాటలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ పాటకు కీరవాణి తన సంగీతంతో, తనదైన స్వరంతో వేరే లెవల్ కు తీసుకు వెళ్లారు. ఈ పాట లిరిక్స్ కూడా కీరవాణి రాయడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X