అందుకే ‘ఈగ’లో డైలాగులు చాలా తక్కువ
తనకేం కావాలో రాజమౌళికి బాగా తెలుసు కాబట్టి నేను పెద్దగా కష్టపడలేదు. ఒకవేళ డైలాగులు లేకపోయినా ఈ సినిమా ఇంతే ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా ఇతర భాషల్లో కూడా పెద్ద హిట్ అయ్యింది. వెండితెరపై బంగారు తీగ రాజమౌళి 'ఈగ' అంటున్నారు 'ఈగ' రచయిత జనార్ధన మహర్షి. ఇక ఇది కళ్లకు సంబంధించిన సినిమా. చెవులకు సంబంధించినది కాదు. అందుకే ఈ చిత్రంలో డైలాగులు చాలా తక్కువ అన్నారు.
అలాగే సినిమా సినిమాకి రాజమౌళి ఒక్కో మెట్టు కాదు.. కొండంత ఎత్తుకి ఎదుగుతున్నారు. తాజా చిత్రం 'ఈగ' ఒక ఎవరెస్ట్. ఈ చిత్రానికి మాటలు రాయడం నా అదృష్టం. తెలుగు సినిమా జాతీయ స్థాయికి ఎదగడంలేదు అంటుంటారు. కానీ 'ఈగ'తో మన సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లగలిగారు రాజమౌళి. భారతదేశం గర్వించదగ్గ సినిమా నిర్మిస్తున్నాననే నమ్మకంతో ఉండేవారు నిర్మాత సాయి కొర్రపాటి అన్నారు.
ఇక నాని చాలా బాగా చేశాడు. చిన్న చిన్న హావభావాలను సమంత చాలా క్యూట్‌గా పలికించింది. సుదీప్ నటన అద్భుతం అని చెప్పారు జనార్థన మహర్షి. నాని, సమంత జంటగా సుదీప్ విలన్‌గా రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఈగ'కు ఆయన మాటలు రాశారు. అలాగే ఇప్పటివరకు 80 సినిమాలకు రాశానని, ఈ సినిమాకి ఏ మాత్రం కష్టపడలేదని చెప్పారు.
వచ్చే ఏడాది 'గంధర్వగానం, హైందవి' అనే చిత్రాలకు దర్శకత్వం వహించనున్నానని, ప్రస్తుతం తెలుగులో రెండు, కన్నడంలో మూడు చిత్రాలకు రచయితగా చేస్తున్నానని ఆయన చెప్పారు. త్వరలో కవితా సంపుటి, కథాసంపుటి పుస్తకాలను విడుదల చేయబోతున్నానని కూడా పేర్కొన్నారు. అలాగే 'సర్వేజనా సుఖినోభవంతు' ట్రస్ట్ ద్వారా కొంతమంది కవులు, రచయితలను ప్రోత్సహించాలనుకుంటున్నానని కూడా మహర్షి చెప్పారు.


Click it and Unblock the Notifications











