కె విశ్వనాథ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రధాన పాత్రల్లో

By Srikanya

కె.విశ్వనాథ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రధాన పాత్రల్లో రచయిత జనార్థనమహర్షి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. 'దేవస్థానం"టైటిల్ తో రూపొందే ఈ చిత్రాన్ని సర్వేజనా సుఖినోభవంతు ఫిలిమ్స్, గురుదేవా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఈ చిత్రంలో దక్షిణ భారతదేశానికి చెందిన ప్రఖ్యాత నాట్యకళాకారిణి అరంగేట్రం చేయబోతున్నారు. అలాగే మూడు తరాల ప్రసిద్ధ గాయనీ గాయకులు ఇందులో పాటలు పాడుతుండటం విశేషం.

6 పాటలు, రెండు హరికథలు, ఒక మ్యూజికల్ సింఫొనీ ఉంటాయి. ఈ చిత్రానికి సురేష్ వి.యన్.కుమార్ ఛాయాగ్రహణం, స్వరవీణాపాణి సంగీతం సమకూరుస్తారు. పలు కళారంగాల్లోని ప్రముఖులు ముఖ్యపాత్రల్లో నటించే ఈ చిత్రాన్ని 'నంది శ్రీహరి" సమర్పించనున్నారు. నంది శ్రీహరి 'నగరం నిద్రపోతున్న వేళ' చిత్రంతో నిర్మాతగా మారారు. జగపతి బాబు, ఛార్మి కాంబినేషన్ లో రూపొందిన ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.ఇక జనార్దన మహర్షి గతంలో గోడ మీద పిల్లి చిత్రంతో దర్శకుడుగా మారారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X