twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా.. భీమవరం సెంటిమెంట్ గురించి తెలుసా!

    |

    Recommended Video

    Will Bhimavaram Sentiment Work For Pawan Kalyan ? | Janasena | Filmibeat Telugu

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించిన తర్వాత అసలు సిసలైన రాజకీయ పరీక్షని ఎదుర్కోబోతున్నాడు. జనసేన పార్టీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌పై ద్రుష్టి పెట్టాడు. జనసేన పార్టీ తపుపున పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన గత కొన్నిరోజులుగా జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం గురించి ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పొటీ చేయబోతున్నారు.

    ఆ నియోజకవర్గాలు ఇవే

    ఆ నియోజకవర్గాలు ఇవే

    పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం విషయంలో ముందు నుంచి విశాఖ జిల్లా గాజువాక పేరు బలంగా వినిపిస్తోంది. గాజువాక నుంచి పవన్ బరిలో దిగడం ఖరారయింది. గాజువాకతో పాటు భీమవరంలో కూడా పవన్ పోటీ చేయబోతున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. తొలిసారి పవన్ ఎన్నికల బరిలోకి దిగుతుండడంతో సినీ రాజకీయ వర్గాల్లో గాజువాక, భీమవరం గురించి చర్చ మొదలయింది.

     పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్

    పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్

    ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, వైసీపీ, జనసేన పార్టీలు బలంగా కనిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. మూడుపార్టీల మధ్య త్రిముఖ పోరు జరిగితే ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉండవు. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కీలకం కానుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    భీమవరం సెంటిమెంట్

    భీమవరం సెంటిమెంట్

    పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి బరిలో దిగుతారని ముందునుంచి అంతా ఊహిస్తూ వచ్చారు. గాజువాకతోపాటు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి కూడా పోటీ చేయనుండడం ఆసక్తిగా మారింది. ఏపీ రాజకీయాల్లో ఈ నియోజకవర్గానికి ఓ సెంటిమెంట్ ఉంది. భీమవరంలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడో దాదాపుగా ఆ పార్టీనే ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. ఈ సెంటిమెంట్ రీత్యా కూడా పవన్ సీఎం అవుతాడా అనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతోంది.

    భీమవరం హిస్టరీ రిపీట్ అవుతుందా?

    భీమవరం హిస్టరీ రిపీట్ అవుతుందా?

    భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. అక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. 1989లో అల్లూరి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందాడు. ఆ తర్వాత వెంకట నరసింహ రాజు పెన్మత్స టీడీపీ అభ్యర్థిగా 1994, 1995లో విజయం సాధించారు. 2004లో గ్రంధి శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థిగా, రామాంజనేయులు పులపర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో రామాంజనేయులు పులపర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. అయితే దాదాపు గెలిచిన అభ్యర్థుల పార్టే అధికారంలోకి రావడంతో ఇక్కడ ఈ సెంటిమెంట్‌ను బలంగా నమ్ముతారని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

    ప్రత్యేకంగా సర్వే

    ప్రత్యేకంగా సర్వే

    పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాల కోసం జనసేన పార్టీ అంతర్గతంగా కొన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తిరుపతి, అనంతపురం, పెందుర్తి, గాజువాక, భీమవరం, ఇచ్చాపురం, రాజానగరం , పిఠాపురం నియోజకవర్గాలు అగ్రస్థానంలో నిలిచినట్లు పార్టీ పేర్కొంది. వీటిలో పవన్ కళ్యాణ్ పోటీకి గాజువాక, భీమవరం నియోజకవర్గాలని ఎంపిక చేశారు. తొలి సారి ఎన్నికల బరిలోకి డుగుతున పవన్ ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువవుతారో చూడాలి.

    English summary
    Janasena Chief Pawan Kalyan to contest from Gajuwaka and Bhimavaram. Andhra Pradesh assembly elections will be held on April 11th
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X