ఫోటోలు: ఎన్టీఆర్‌ని ఓదార్చుతున్న పవన్, చేతిలో చేయిపెట్టి.. హరికృష్ణకు నివాళి!
నందమూరి కుటుంబ సభ్యులని, అభిమానులని దుఃఖసాగరంలో ముంచేలా హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంతిమ యాత్ర, అంత్యక్రియలు నిర్వహించనుంది. సినీ రాజకీయ ప్రముఖులంతా హరికృష్ణ నివాసానికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు.

నివాళులర్పించిన పవన్
పవన్ కళ్యాణ్ హరికృష్ణ నివాసానికి చేరుకొని ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. తాను హరికృష్ణ గారిని తక్కువ సార్లు కలిశానని పవన్ తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో తన ఎంపీ పదవికి సైతం రాజీనామా చేశారని పవన్ గుర్తు చేశారు.

మనోవేదనతో
తండ్రి మరణంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తీవ్రమైన మనో వేదనతో కనిపిస్తున్నారు. ఇంతటి దుఃఖంలో కూడా తదుపరి జరగాల్సిన కార్యక్రమాల విషయంలో అన్నదమ్ములిద్దరూ చొరవ తీసుకుంటున్నారు.
Recommended Video


ఓదార్చిన పవన్
తండ్రి అకాలమరణం విషాదంలో ఉన్న ఎన్టీఆర్ ని పవన్ ఓదార్చారు. ఎన్టీఆర్ చేతిలో చేయిపెట్టి పవన్ ఓదార్చుతున్న దృశ్యాలు మీడియాకు విడుదల అయ్యాయి.

అంతిమ యాత్ర
హరికృష్ణ అంతిమ యాత్ర మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభంకానుంది. హరికృష్ణ నివాసం ముందు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్దీ సేపటి క్రితమే ఎపి సీఎం చంద్రబాబు కూడా హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు.


Click it and Unblock the Notifications











