twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనూహ్యం: సెల్ఫీతో 'కత్తి' వివాదం సుఖాంతం, ఫైనల్ స్టేట్‌మెంట్ ఇదే!, తెర వెనుక ఏం జరిగింది?

    |

    Recommended Video

    'కత్తి' వివాదం సుఖాంతం.. పవన్ ఫ్యాన్స్-కత్తి మహీష్ సెల్ఫీ..!

    నాలుగు నెలలుగా ఇదో ఎడతెగని వ్యవహారం. కొంతమందికి విపరీతమైన చికాకు, మరికొంతమందికి విపరీతమైన ఆసక్తి. టీవి పెడితే ఎక్కడ అవే ముఖాల్ని చూడాల్సి వస్తుందోనని కొంతమంది భయపడ్డారు కూడా. ఫైనల్‌గా ఇది అయ్యేది కాదు.. పోయేది కాదు.. అని చాలామంది తీర్మానించేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ కథ సుఖాంతమవడం విశేషం. ఇంతకీ ఏం జరిగింది..

    అజ్ఞాతవాసి'కి హెచ్చరిక: ఇక చర్యలే అన్న జెరోం సల్లే.., ఇంతచేసి స్పందించరా?అజ్ఞాతవాసి'కి హెచ్చరిక: ఇక చర్యలే అన్న జెరోం సల్లే.., ఇంతచేసి స్పందించరా?

    సెల్ఫీతో సుఖాంతం:

    సెల్ఫీతో సుఖాంతం:

    నాలుగు నెలల వివాదానికి కత్తి మహేష్, పవన్‌కల్యాణ్ అభిమానులు ఒక సెల్ఫీతో సుఖాంతం పలికారు. అంతేనా.. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టే పనిచేశారు. ఈ పరిణామం చాలామందికి ఆశ్చర్యంగానే అనిపించింది.

    మెత్తబడ్డ కత్తి:

    మెత్తబడ్డ కత్తి:

    నాలుగు నెలలుగా బద్ద శత్రువుల్లా సాగుతున్న ఆరోపణలు-ప్రత్యారోపణల పర్వానికి శుక్రవారం ఎట్టకేలకు ముగింపు పలికినట్లే కనిపిస్తోంది. ఇందుకోసం కొంతమంది జనసేన నాయకులు రంగంలోకి దిగి మహేష్ కత్తితో ప్రత్యేకంగా చర్చలు జరిపారు.

    'కత్తి' కోసం మరో లేఖ:

    'కత్తి' కోసం మరో లేఖ:

    మహేష్ కత్తితో చర్చల్లో భాగంగా.. ఆయనపై కోడి గుడ్లతో దాడి చేసినవారితో జనసేన నాయకులు క్షమాపణలు కోరారు. అంతేకాదు, 'సంయమనం పాటించాలి' అని కోరుతూ జనసేన ముందు విడుదల చేసిన లేఖతో మహేష్ కత్తి సంతృప్తి చెందకపోవడంతో..పవన్ అభిమానులు ఎలా ఉండాలో విధివిధానాలతో మరో లేఖను విడుదల చేశారు. దీంతో కత్తి కాస్త మెత్తబడ్డారు.

    కత్తి ఫైనల్ స్టేట్‌మెంట్:

    కత్తి ఫైనల్ స్టేట్‌మెంట్:

    నా పైన దాడి చేసిన పరిపక్వత లేని, పేద, భ్రమిత పవన్ కళ్యాణ్ అభిమానులను శిక్షించడం నా ఉద్దేశం కాదు. ఆ ఇద్దరిలో ఒక దళితుడు ఉండటం కడు శోచనీయం.

    అందుకే కేసు విత్ డ్రా:

    అందుకే కేసు విత్ డ్రా:


    పవన్ కళ్యాణ్ & జనసేన ఇప్పుడిప్పుడే నేను ఆశించిన దిశగా అభిమానులకు, శ్రేణులకు మార్గదర్శకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రవర్తనా నియమావళి అందించారు.స్పందిస్తున్నారు.

    ఈ పరిస్థితుల్లో గైడెన్స్ లేని పిచ్చి అభిమానంతో నాపై దాడిచేసిన వారిని శిక్షించడానికి కాకుండా వారిని సంస్కరించడానికి నేను నైతికంగా బద్ఢుడను. అందుకే కేసును ఉపసంహరించుకుంటున్నాను.

    అది పవన్ విజ్ఞత:

    అది పవన్ విజ్ఞత:

    ఇక, నాపై దాడిని ఖండించడం, క్షమాపణలు చెప్పడం పవన్ కళ్యాణ్ విజ్ఞతకే వదిలేస్తున్నాను.

    కత్తితో ఫ్యాన్స్ సెల్ఫీలు:

    కత్తితో ఫ్యాన్స్ సెల్ఫీలు:

    కత్తితో చర్చల అనంతరం కత్తి మహేష్‌తో కలిసి స్వీట్లు పంచుకున్న కార్యకర్తలు, అభిమానులు ఇక వివాదం సమసిపోయినట్లేనని ప్రకటించారు. అక్కడే కత్తితో పవన్ అభిమానులు సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఇకపై కత్తి మహేష్‌కు తమకు ఎలాంటి గొడవలు ఉండబోవని ప్రకటించారు.

    వ్యక్తిగతం తప్ప..:

    వ్యక్తిగతం తప్ప..:

    పవన్ నుంచి నేరుగా క్షమాపణ డిమాండ్ చేసిన మహేష్ కత్తి.. కార్యకర్తలు, అభిమానులతో చర్చల్లో మెత్తబడటం గమనార్హం. తనపై దాడి చేసిన వారు పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతోనే కేసు వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. అయితే రాజకీయంగా సినిమాల పరంగా తన విమర్శలు కొనసాగుతాయని, వ్యక్తిగత విమర్శల జోలికి మాత్రం వెళ్లనని స్పష్టం చేశారు.

    English summary
    Putting an end to controversy, Janasena official spokes person declared that the rivalry between Mahesh Kathi and fans was ended now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X