RRR ఈవెంట్ లో ఎన్టీఆర్ అభిమానులు చేసిన పనికి మెగా ఫ్యాన్స్ ఆగ్రహం.. తృటిలో తప్పిన యుద్ధం!
ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR సినిమా మార్చి 25 వ తేదిన భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన భారీ ప్రీ రిలీజ్ వేడుకను శనివారం రోజు కర్ణాటకలో నిర్వహించారు. అయితే ఈ వేడుకలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం తలపించింది. ఒకవైపు మెగా అభిమానులు జనసేన పార్టీ జెండాలతో హడావిడి చేయగా మరొకవైపు నందమూరి అభిమానులు తెలుగుదేశం పార్టీ జెండాలతో ఊహించని విధంగా ఇక్కడ సందడి చేశారు. అయితే ఒకానొక సమయంలో రెండు వర్గాల అభిమానుల మధ్య భీకర పోరాటం జరిగే ఒక సంఘటన చోటు చేసుకునేది. పోలీసులు ముందుగానే చాకచక్యంగా వ్యవహరించి ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడంతో ఆ ప్రమాదం తప్పింది. ఆ వివరాల్లోకి వెళితే..

భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్
గతంలో ఎప్పుడూ లేనివిధంగా మెగా నందమూరి హీరోల కలయికలో వచ్చిన RRR సినిమా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో క్రేజ్ అయితే అందుకుంది. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని చాలామంది సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మెగా నందమూరి అభిమానులు కూడా మొదటి రోజు మొదటి షో చూడాలని ఎంతో ఆతృతగా ఉన్నారు. శనివారం రోజు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెండు వర్గాల అభిమానులతో ఈవెంట్ మంచి విజయాన్ని అందుకుంది.

మొదటి రోజు సాలీడ్ వసూళ్లు..
రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటించిన త్రిబుల్ ఆర్ సినిమా మార్చి 25వ తేదీన విడుదలవుతోంది. గతంలో ఏ ఇండియన్ సినిమా కూడా విడుదల కాని స్థాయిలో RRR సినిమా అత్యధిక థియేటర్స్ లో విడుదల అవుతోంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటిరోజు 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ అందుకుంటుందని బాక్స్ ఆఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు.

ముందే తెలుసు..
అయితే RRR ఈవెంట్ ను నిర్వహించడం చాలా సెన్సిటివ్ విషయమని చిత్ర యూనిట్ సభ్యులకు ముందే తెలుసు. ఎందుకంటే రెండు వర్గాల అభిమానులు పొలిటికల్ వాతావరణాన్ని తలపిస్తారని కూడా ఊహించారు. అందుకే 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటకలో నిర్వహించారు. అక్కడకి కర్ణాటక ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక అతిథిగా రావడం విశేషం. ఇక కన్నడ హీరో శివ రాజ్ కుమార్ కూడా ప్రత్యేక అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే.

జనసేన vs టీడీపీ
అయితే ఈవెంట్ అంతా సవ్యంగానే సాగుతున్న సమయంలో ఒకవైపు మెగాభిమానులు జనసేన జెండాలతో మరొకవైపు నందమూరి అభిమానులు తెలుగుదేశం పార్టీ జెండాలతో ఎవరూ ఊహించని విధంగా దర్శనమిచ్చారు. వేడుకలో అయితే జూనియర్ ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న టీడీపీ జెండాలు ఎక్కువగానే కనిపించాయి.

జనసేన జెండాను తీసేసి..
అయితే ఈ ఈవెంట్ లో ఒకసారి ఎవరూ ఊహించని విధంగా ఇరు వర్గాల అభిమానుల మధ్య భీకర యుద్ధమే జరిగే ఒక సంఘటన చోటు చేసుకుంది. సౌండ్ బాక్స్ ల కోసం సెట్ చేసిన కర్రల పైకెక్కిన కొంతమంది జనసేన అభిమానులు ముందుగానే జనసేన పార్టీ జెండాను కట్టేసి ఉంచారు. ఇక తర్వాత దాన్ని ఎన్టీఆర్ అభిమానులు తీసేసే అక్కడ తెలుగుదేశం పార్టీ జెండాలు ఉంచారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రదేశంలో వాతావరణం మారిపోయింది.

ఏ మాత్రం పొరపాటు జరిగినా..
తెలుగుదేశం పార్టీ జెండాను అలా పెట్టడంతో జనసేన అభిమానులు ఒక్కసారిగా గట్టిగా అరిచేశారు. ఆ తర్వాత ఇరువర్గాల మధ్య కొంత మాటా మాటా పెరిగింది. ఇక అప్పటికే పోలీసులు అక్కడికి చేరుకొని రెండు వర్గాలను సీరియస్ గా విడగొట్టడంతో అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఏ మాత్రం పొరపాటు జరిగినా ఇరు వర్గాల అభిమానుల మధ్య ఒక యుద్ధమే జరిగేది. ఏదేమైనా పోలీసులు కఠినమైన ఆంక్షలతో వేడుక కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు.


Click it and Unblock the Notifications











