twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి పుట్టినరోజు వేడుకలో ప్రత్యేకాకర్షణగా నిలిచిన ఆ పార్టీ ఎమ్మెల్యే

    |

    మెగా అభిమానులకు పండుగ రోజు అంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతీ ఏడాది ఆయన బర్త్ డేని ఎంతో స్పెషల్‌గా నిర్వహిస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు మెగా ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 22న ఆయన 64వ పుట్టిన రోజు సందర్బంగా బుధవారమే భారీ వేడుక ప్లాన్ చేశారు. ఈ వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరుగుతోంది. అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ ఫంక్షన్‌కు ప్రత్యేక అతిథులు విచ్చేస్తున్నారు.

    మెగా అభిమానులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఇప్పటికే చాలా మంది శిల్పకళావేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో హైటెక్ సిటీ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. అదే సమయంలో ట్రాఫిక్ జాం కూడా అవుతోంది. ఈ ఫంక్షన్ వల్ల హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ కూడా రద్దీగా ఉంది. వాస్తవానికి ఉదయం నుంచే చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్ద పాసుల కోసం వాళ్లంతా పడిగాపులు కాశారు. చివరకు పాసులు దక్కించుకుని వేడుకకు చేరుకుంటున్నారు.

    Janasena Mla Rapaka Vara Prasada Rao Special attraction in Chiranjeevi Birthday Function

    ఇక, ఇదే వేడుకలో ఓ ఎమ్మెల్యే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన మరెవరో కాదు. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించిన విషయం తెలిసిందే. రాపాక ఆడిటోరియంలోకి ఎంటరయ్యే సమయంలో మెగా అభిమానులు అందరూ కేకలతో ఆయనకు స్వాగతం పలికారు. దీంతో శిల్పకళావేదిక దద్దరిల్లిపోయింది.

    Janasena Mla Rapaka Vara Prasada Rao Special attraction in Chiranjeevi Birthday Function

    English summary
    Pawan Kalyan as Chief Guest at Chiranjeevi's 64th Birthday Celebration. The ceremony take place at Shilpa Kala Vedika in Hyderabad. For this event the huze Mega fans are came from both telugu states.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X