మూడో భార్యతో ఆ పని చేయించి...విడాకుల వార్తలకు చెక్ పెట్టిన పవన్ కల్యాణ్

పవర్‌స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన మూడో భార్య అన్నా లెజినోవా విడిపోతున్నారని రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం సాగుతోంది. అయితే ఇదే సమయంలో మెగా డాటర్ నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల విడాకుల ప్రకటన రావడం కూడా .. పవన్ పై తీవ్రంగా ప్రతికూలత చూపింది. అయితే తాజాగా పవన్ .. తన భార్యతో విడిపోతున్నారా లేదా అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే....

మూడో భార్య.తో విడాకులు: జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే ఆయన మొదలు పెట్టిన వారాహి విజయ యాత్ర మొదటి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. మరికొద్ది రోజుల్లో రెండవ దశ యాత్ర కూడా ప్రారంభం కానుంది. అయితే ఈ సమయంలో పవన్ కళ్యాణ్.. తన మూడో భార్య అన్నా లెజినోవాతో విడిపోయారనే వార్తా రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Janasena Party President Pawan Kalyan And Anna Lezhneva Performed Puja

వార్తలకు చెక్ పెట్టిన పవన్: ఇప్పటికే ఇద్దరు దూరంగా ఉంటున్నారని, త్వరలోనే చట్టపరంగా విడాకులు తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. దీంతో రాజకీయంగా పవన్ ఇమేజ్‌కు నష్టం కలిగించే పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా దీని పై జనసేనాని అధికారంగా స్పందించింది. ట్రోలర్స్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. విడాకుల వార్తను ఖండిస్తూ జనసేన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్‌ నుంచి కొత్త పోస్ట్ ను చేసి రూమర్స్ కు చెక్ పెట్టింది.

Janasena Party President Pawan Kalyan And Anna Lezhneva Performed Puja

అన్నాతో కలిసి పూజలు: పవన్‌, అన్నా లెజినోవా దంపతులు కలిసి బుధవారం తమ ఇంట్లో పూజ చేసిన ఫొటోను ట్వీట్ చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల - వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు.

Janasena Party President Pawan Kalyan And Anna Lezhneva Performed Puja

పవన్ కు వ్యతిరేకంగా దుష్ప్రచారం: కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ తో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న దుష్ప్రచారానికి ముగింపు పడింది. అయితే ఏపీ రాజకీయాల్లో పవన్ ఇమేజ్ పెరుగుతున్న నేపథ్యంలో జనాల్లో ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు.. అధికార పార్టీ నేతలు ఇలాంటి అసత్య ప్రచారాలకు చేస్తున్నారని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Janasena Party President Pawan Kalyan And Anna Lezhneva Performed Puja

ట్వీట్ వైరల్: 'ప్యాకేజ్' ఇచ్చి మరీ నేషనల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని.. అలాంటి వారందరికీ చెప్పుతో కొట్టినట్లుగా జనసేన పార్టీ సమాధానమిచ్చిందని అంటున్నారు. జనసేనాని ట్వీట్ ని సోషల్ మీడియా ట్రెండ్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం పవన్ రాజకీయాలతో పాటు పలు చిత్రాల్లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. జులై 29 న ఆయన నటించిన బ్రో చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X