twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ పుట్టినరోజు: ఫ్యాన్స్ ట్వీట్లతో సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Actor Pawan Kalyan's Birthday Special

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నేడు పండగ రోజు. ఈ రోజు ఆయన 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. గత పుట్టినరోజులతో పోలిస్తే పవర్ స్టార్‌కు ఇది ప్రత్యేకమైన పుట్టినరోజు అని చెప్పొచ్చు. ఆయన జీవితంలో సినిమా అనే అంకం దాదాపుగా ముగిసిన తర్వాత వస్తున్న బర్త్ డే.

    1971 సెప్టెంబర్ 2న జన్మించిన పవన్ కళ్యాణ్ 1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై టాప్ స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన సినిమా జీవితం ఈ ఏడాది జనవరిలో విడుదలైన 'అజ్ఞాతవాసి'తో ముగిసింది. ప్రస్తుతం ఆయన పవర్ స్టార్ ఇమేజ్ వదిలేసి జనసేనానిగా ప్రజల్లోకి వచ్చారు.

    జనసేనాని ఫ్యాన్స్ తమ అభిమాన నాయకుడిని విష్ చేస్తూ పోస్టులు చేస్తుండటంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ నామ స్మరణే కనిపిస్తోంది.

    అన్నయ్యను మించిపోయాడు

    అన్నయ్యను మించిపోయాడు

    చిరంజీవి వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టినప్పటికీ, తనకంటూ ప్రత్యేకమైన స్టయిల్‌తో యువతరం అభిమాన హీరోగా మారి తెలుగులో ఎవరూ ఊహించని ఇమేజ్‌నూ సొంతం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. అన్నయ్యను మించిన తమ్ముడిగా పేరు తెచ్చుకున్నారు.

    రాజకీయాల్లోకి

    రాజకీయాల్లోకి

    తెలుగు చలన చిత్ర సీమలో ఎవరికీ దక్కనటువంటి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ప్రజల పక్షాన పోరాడటం కోసం రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం ప్రజల తరుపున పోరాటం చేస్తున్నారు.

    కళ్యాణ్ బాబు

    కళ్యాణ్ బాబు

    పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కల్యాణ్ బాబు. కొణిదెల వెంకటరావు, అంజనా దేవి దంపతుల మూడో కుమారుడు. సెప్టెంబరు 2, 1972న జన్మించాడు. పవన్ కళ్యాణ్ ప్రాథమిక విద్య పశ్చిమగోదావరి జిల్లాలోనే జరిగింది. ఇంటర్ మీడియట్ నెల్లూరు లోని వి.ఆర్.సి కళాశాలలో పూర్తి చేసాడు. పిమ్మట కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు.

    అదే ఆయన ప్రత్యేకత

    అదే ఆయన ప్రత్యేకత

    తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచనా ధోరణే పవన్ కళ్యాణ్ కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. రాజకీయాల్లో ఆయనకు ఇంతర ఆదరణ లభించడానికి కారణం కూడా అదే.

    సేవాగుణం

    సేవాగుణం

    రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా తన సినిమా వల్ల నష్ట పోయిన వారికి పవన్ అనేక సందర్భాల్లో అండగా ఉన్నారు. పవన్ నటించిన 'జానీ' సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వల్ల లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్లకు నష్టపోయిన అమౌంట్ ఇచ్చి ఆదుకున్నారు పవన్. తర్వాత కూడా తన ఇతర సినిమాల విషయంలో నష్టపోయిన వారికి ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసేవారు. తన చివరి సినిమా అజ్ఞాతవాసి సినిమా నష్టం విషయంలోనూ అదే కొనసాగించారు.

    జనసేన

    జనసేన

    పవన్ కళ్యాణ్ కి కాస్త ఆవేశం ఎక్కువే...తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతుంటే సహించలేని ఆవేశమే ఆయన రాజకీయాల వైపు వచ్చేలా చేసింది. జనసేన పార్టీ స్థాపించడానికి కారణమైంది. రాజకీయనేతగా ప్రజలకు మరింత సేవా కార్యక్రమాలు చేయాలని భావించిన పవన్ కళ్యాణ్ మార్చి 14, 2014 న జనసేన పార్టీ స్థాపించారు.

    English summary
    Actor Pawan Kalyan turns 46 today. Konidela Kalyan Babu, better known by his stage name Pawan Kalyan, is an Indian film actor, producer, director, screenwriter, writer, and politician.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X