‘జనసేన’ రివ్యూ మీటింగులో సినీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్!

Recommended Video

Pawan Kalyan Clarifies About Re-Entry In Movies || Filmibeat Telugu

2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఘోర పరాజయం పాలైంది. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తనతో సహా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులందరూ ఓటమి పాలయ్యారు. అయితే రాజోలు అసెంబ్లీ స్థానంలో మాత్రమే పార్టీ నెలబెట్టిన ఒకే ఒక్క అభ్యర్థి విజయం సాధించాడు.

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులతో విజయవాడలో గత రెండు రోజులుగా రివ్యూ మీటింగులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు పవన్ కళ్యాణ్ సినిమా రీ ఎంట్రీ విషయంలో బయట జరుగుతున్న ప్రచారం గురించి ప్రస్తావించారట.

సినిమాల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పిన పవన్ కళ్యాణ్

సినిమాల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ ఓటమితో పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల వైపు వెళుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వచ్చింది. తాను మళ్లీ సినిమాల వైపు వెళ్లే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ లక్ష్యం అదే

పవన్ కళ్యాణ్ లక్ష్యం అదే

జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారట. పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేసే విధంగా కార్యాచరణ రూపొందించారట. ఈ మేరకు తాజా రివ్యూ మీటింగులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎవరితో సంబంధం లేకుండా

ఎవరితో సంబంధం లేకుండా

గతంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వమే ఈ సారి జనసేన పార్టీ కొంపముంచిందనేది పలువురి వాదన. ఈ నేపథ్యంలో ఇకపై ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అభిమానులు ఆశలు వదులుకోవాల్సిందే

అభిమానులు ఆశలు వదులుకోవాల్సిందే

పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వస్తారని అభిమానుల్లో ఇంకా ఏదో ఒక చిన్న ఆశ మిగిలే ఉంది. అయితే తాజా రివ్యూ మీటింగులో ఫ్యాన్స్ అలాంటి ఆశలు వదులుకోవాల్సిందే అని పవర్ స్టార్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X