పవన్ కళ్యాణ్ మూడు వివాహాలు... అసలు విషయం ఇదీ, అందరి నోరు మూయించారు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల బాట పట్టిన సంగతి తెలిసిందే. చాలా కాలం క్రితమే జనసేన పార్టీ స్థాపించిన ఆయన 2019 ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రస్తుతం సీరియస్‌గా పాలిటిక్స్‌లో మునిగిపోయారు. పవన్ కళ్యాణ్‌ను దెబ్బకొట్టడానికి ప్రత్యర్థులు ఆయన్ను పర్సనల్‌గా టార్గెట్ చేస్తుండటం తరచూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఆయన మూడు వివాహాల గురించి ప్రస్తావిస్తూ ప్రజల్లో ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన స్పోక్ పర్సనల్ అడ్డెపల్లి శ్రీధర్ ఓ ఇంటర్వ్యూలో దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడంతో పాటు విమర్శకుల నోరు మాయించే సమాధానమిచ్చారు.

మొదటి భార్యతో అందుకే విడిపోయారు
పవన్ కళ్యాణ్ మొదటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో ప్రయాణించింది ఒక నెల రోజులు మాత్రమే. తర్వాత ఆమె మా ఇంటికి ఇల్లరికం రండి అని పవన్ కళ్యాణ్‌ను అడగటంతో పాటు మరికొన్ని అభిప్రాయ బేధాల వల్ల వారి వైవాహిక బంధం నిలవలేదని శ్రీధర్ వెల్లడించారు.

పదేళ్ల వరకు పెళ్లి చేసుకోలేదు
మొదటి భార్యకు దూరమైన తర్వాత పది సంవత్సరాల వరకు ఆయన మరో పెళ్లి చేసుకోలేదు. ఆమెతో చట్టపరంగా డైవర్స్ అయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారు.... అని శ్రీధర్ వెల్లడించారు. భార్య భర్తలు విడిపోవడానికి అనేక వ్యక్తిగత కారణాలు ఉంటాయి అన్నారు.

చెప్పుకోవడానికి కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, కానీ...
ఇదంతా చెప్పుకోవడానికి కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు స్థిరమైన నిర్ణయం తీసుకోలేరా? జీవితానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోలేని వ్యక్తి ప్రజలకు సంబంధించి స్థిరమైన నిర్ణయం ఎలా తీసుకుంటారని కొందరు విమర్శించవచ్చు. పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెతో ట్రావెల్ చేద్దామనుకున్నారు, పరిస్థితులు అందుకు అనుకూలించ లేదు... అని శ్రీధర్ చెప్పే ప్రయత్నం చేశారు.

రెండో భార్య కూడా ఎప్పుడూ డిఫర్ అవ్వలేదు
రెండో భార్య కూడా పవన్ కళ్యాణ్ వల్ల ఎప్పుడూ డిఫర్ అవ్వలేదు. మ్యూచువల్ అండర్ స్టాడింగుతో విడిపోయారు. ఇప్పటికీ ఫ్రెండ్స్ అంటున్నారు. మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఉన్నాయో వాటికింద సెటిల్మెంట్ చేసుకున్నారు. పిల్లల విషయంలో ఇద్దరూ కలిసి కేర్ తీసుకుంటున్నారు.... అని శ్రీధర్ తెలిపారు.

వారిలా పవన్ కళ్యాణ్ చేయడం లేదు...
ఓ కర్నాటక చీఫ్ మినిస్టర్ ఓపెన్ గా ఓ కామెంట్ చేశారు. నలుగురు ఐదుగురు అమ్మాయిలతో ఉంటాను. నా వైఫ్ కు లేని ప్రాబ్లం మీరెందుకు అడుగుతున్నారు అని డైరెక్టుగా అడగటం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో భార్య ఉంటూనే బయట లేడీ పార్ట్‌నర్స్ చాలా మంది రాజకీయ నాయకులకు ఉన్నారు. అలాంటివి పవన్ కళ్యాణ్ చేయడం లేదు.... అని శ్రీధర్ తెలిపారు.


Click it and Unblock the Notifications











