Pawan Kalyan: అభిమాని చివరి కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్.. హార్ట్ టచింగ్ వీడియో వైరల్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెండి తెరపై ఒకవైపు పవర్ స్టార్ గా కొనసాగుతూనే మరోవైపు ప్రజాసేవలో బిజీగా మారిపోతున్నాడు. ఈ క్రమంలో ఆయన ఎంతోమంది కష్టాలను తెలుసుకొని తన వంతు సహాయం చేసేందుకు కృషి చేస్తున్నాడు. రాజకీయాల్లోకి రాకముందే పవన్ కళ్యాణ్ ఒక మంచి మనిషిగా అభిమానుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన అప్పుడప్పుడు తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న ఫ్యాన్స్ ని కూడా కలుసుకుంటున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఒక అభిమాని చివరి కోరికను నెరవేర్చాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో కంటతడి పెట్టిస్తోంది. పవన్ కళ్యాణ్ ఆ వీడియోలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న అభిమానిని ప్రత్యేకంగా పరామర్శించి అతని ఆరోగ్యం గురించి తెలుసుకున్నాడు. ఇక అతను చివరిసారిగా పవన్ కళ్యాణ్ ను కలుసుకోవాలని కోరుకోవడంతో వెంటనే పవన్ అంబులెన్స్ లో ఉన్న అతని దగ్గరకే వచ్చాడు.

ఇక పవన్ కళ్యాణ్ ను చూసిన అభిమాని ఎంతగానో సంతోషించాడు. ఇంతకుముందు కూడా చాలా మంది ఫ్యాన్స్ ను పవన్ కళ్యాణ్ ఇలాగే కలుసుకున్నాడు అని కూడా మరి కొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఒక ప్రత్యేకమైన అంబులెన్స్ సర్వీస్ కూడా మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో అంబులెన్స్ సర్వీస్ లను ప్రారంభించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇదివరకే కొన్ని గ్రామాల్లో ప్రత్యేకంగా రోడ్లు వేయించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంబులెన్స్ సర్వీస్ లు కూడా మొదలు పెట్టడం గొప్ప విషయం అని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరపైకి రానున్న ఆ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇక వచ్చే ఏడాది ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











