twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య చేతుల్లోకి జనతా గ్యారేజ్ డబ్బు.., అబ్బాయ్ బాబాయ్ ఒకటైపోయినట్టేనా..!?

    జనతాగ్యారేజ్ బైక్ వేలం ద్వారా ద్వారా రూ.10 లక్షలు పోగవగా.. ఆ మొత్తాన్ని నందమూరి బాలకృష్ణ చేతికి అప్పగించారు జనతాగ్యారేజ్ చిత్ర నిర్మాతలు..

    |

    పర్యావరణ స్పృహ ని రిలేట్ చేస్తూ కొరటాల శివ దర్శకత్వం వహించిన జనతా గ్యారేజ్ సినిమా పెద్ద హిట్ అవ్వడం అందరికీ తెలిసిందే. కథ, కథనం పరంగానే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా మంచి సక్సెస్ సాధించింది. సినిమా గురించి అటుంచితే ఇందులో ఎన్‌టీఆర్ ఉపయోగించిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకు గుర్తుందా... ఆ బైకును మంగళవారం నాడు జనతా గ్యారేజ్ బృందం వేలం వేసారు.

    బైకును సొంతం చేసుకునేందుకు

    బైకును సొంతం చేసుకునేందుకు

    ‘జనతా గ్యారేజ్'లో హీరో కోసమని ఎన్ ఫీల్డ్ బైకును ప్రత్యేకంగా డిజైన్ చేయించడం విశేషం. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆ బైకును సొంతం చేసుకునేందుకు పోటీ నిర్వహించారు. అందులో గెలిచిన నల్గొండ వాసి రాజ్ కుమార్ రెడ్డికి ఎన్టీఆర్ చేతుల మీదుగానే బైకును అందజేశారు కూడా. పోటీ ద్వారా వచ్చిన డబ్బుల్ని బసవతారకం ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు.

    క్లాసిక్ 500 మోటార్ సైకిల్

    క్లాసిక్ 500 మోటార్ సైకిల్

    బైకు విషయానికి వస్తే, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ శ్రేణిలో ఉన్న క్లాసిక్ 500 మోటార్ సైకిల్. ఇందులో 499సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్, డిజిటల్ ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్ గల పెట్రోల్ ఇంజన్ ఉన్న ఈ బైక్ ఈ సినిమాకే ప్రత్యేకాకర్షణ గంటకు 131కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే దీని మైలేజ్ లీటర్‌కు 32 కిలోమీటర్లుగా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ దీని క్లాసిక్ తాన్, క్లాసిక్ బ్లాక్ మరియు క్లాసిక్ సిల్వర్ వంటి రంగుల్లో అందించింది. అయితే జనతా గ్యారేజ్ బృందం దీనిని గ్రీన్ కలర్‌లో రూపొందించింది.

    10 లక్షలు

    10 లక్షలు

    ‘జనతా గ్యారేజ్' సినిమాలో ఎన్టీఆర్ వాడిన రాయల్ ఎన్ ఫీల్డ్ బైకును సొంతం చేసుకునేందుకు అభిమానులకు ఒక పోటీ పెట్టారు. ఆ పోటీ ద్వారా రూ.10 లక్షలు పోగవగా.. ఆ మొత్తాన్ని నందమూరి బాలకృష్ణ చేతికి అప్పగించారు చిత్ర నిర్మాతలు.. దర్శకుడు కొరటాల శివ. ఈ మొత్తం బాలయ్య ఆధ్వర్యంలో నడిచే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు విరాళంగా అందజేశారు. స్వయంగా బాలయ్య ఇంటికి వెళ్లి ఆయన చేతికి చెక్కు అందించారు ‘జనతా గ్యారేజ్' దర్శక నిర్మాతలు.

    జూనియర్ వల్ల వచ్చిన విరాళం

    జూనియర్ వల్ల వచ్చిన విరాళం

    ఇంతకీ ఈ సంఘటన తో అబ్బాయ్ బాబాయ్ లమధ్య వివాదాలు ఉన్నాయన్న వార్తలకి తెరపడ్దట్టేనా..?లేక ఈ సందర్భంగా అక్కడ ఎన్టీఆర్ కనిపించకపోవటం అంటే ఇంకా ఆ వివాదం కొనసాగుతున్నట్టే అనుకోవాలా? ఏదేమైనా జూనియర్ వల్ల వచ్చిన విరాళం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి వెళ్ళటం మాత్రం అందరికీ ఆనందం కలిగించే విషయమే కదా...

    English summary
    Mythri Makers has handed over the cheque of 10 lakhs collected through Janatha Garage bike auction Mony to Nandamuri Balakrishna for his Basavatarakam Cancer Hospital.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X