ఎన్టీఆర్-కొరటాల శివ ‘జనతా గ్యారేజ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

By Bojja Kumar

హైదరాబాద్: సంక్రాంతికి విడుదలైన ‘నాన్నకు ప్రేమతో' తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించడంతో జూ ఎన్టీఆర్, ఆయన ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా కాలంగా తనకు అందని ద్రాక్షగా ఉన్న రూ. 50 కోట్ల మార్కను ఈ సారి ఎలాగైనా అందుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు జూనియర్.

ప్రస్తుతం ఎన్టీఆర్ తన తదుపరి చిత్రానకి రెడీ అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి ‘జనతా గ్యారేజ్' అనే టైటిల్ తో పిలుస్తున్నారు. ఇప్పటికే లాంచనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం ఫిబ్రవరి 10 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఫిబ్రవరి 17న ఎన్టీఆర్ సెట్స్ లో జాయినవుతాడని అంటున్నారు.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ చిత్రాన్ని ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా దర్శకుడు పక్కా ప్రణాళిక సిద్ధం చేసాడని, ఈ మేరకు అంతా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నాడని అంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ నటిస్తున్నారు. ముఖ్యమైన పాత్రలో మళయాలం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నారు.

Janatha Garage Releasing August 12th

ఈ చిత్రానికి అంతా టాప్ టెక్నీషియన్లే పని చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకటైన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, సినిమా ఎడిటింగ్ విభాగంలో ప్రముఖుడై కోటగిరి వెంకటేశ్వరరావు పని చేస్తున్నారు. దీంతో పాటు క్రిష్-3 లాంటి భారీ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన తిరు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.

ఈ మూవీ కోసం హైద్రాబాద్ సారధి స్టూడియోస్ లో భారీ సెట్ వేస్తున్నారు. ఎన్టీఆర్ వర్క్ చేయబోయే జనతా గ్యారేజ్ పేరుగల మెకానిక్ షెడ్ ని దాని చుట్టుపక్కలుండే ప్రాంతాలను సెట్ వేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఇప్పటికే సెట్ నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి - తిరు . ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావు . ఆర్ట్ - ఎ. ఎస్. ప్రకాష్. సంగీతం - దేవీ శ్రీ ప్రసాద్ నిర్మాతలు - నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం - కొరటాల శివ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X