»   » త్రివిక్రమ్‌కు 'జంధ్యాల' పురస్కారం

త్రివిక్రమ్‌కు 'జంధ్యాల' పురస్కారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు 'జంధ్యాల' పురస్కారాన్ని ప్రదానం చేశారు. 'జంధ్యాల హాస్యోత్సవం' నవ్వులు పూయించింది. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, జంధ్యాల చిత్ర మిత్ర మండలి ఆధ్వర్యంలో రవీంద్రభారతి వేదికపై సంక్రాంతి సంబరాలు, జంధ్యాల హాస్యోత్సవం నిర్వహించారు. సినీ, బుల్లితెర హాస్యనటులు 'జంధ్యాల' కు హాస్యాభిషేకం చేశారు. నవ్వుల బాబురావు, శంకర నారాయణ నవ్వుల 'క్రాంతి' ని సృష్టించారు. నటుడు ఏవీఎస్‌కూ స్మృతాంజలి ఘటించారు. ఉత్సవాలను కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ప్రారంభించారు.

'Jandhyala Memorial Award' to Trivikram Srinivas

ఇక త్రివిక్రమ్ తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. అల్లు అర్జున్‌ కూడా కొత్త సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 'జులాయి' కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఆ చిత్రం ఏ క్షణంలోనైనా సెట్స్‌ పైకి వెళ్లే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. త్రివిక్రమ్‌ ఇప్పటికే కథని సిద్ధం చేశాడని సమాచారం.

త్రివిక్రమ్,అల్లు అర్జున్ గతంలో జులాయి చిత్రం చేసారు. ఈ సారి ఈ కొత్త చిత్రం కూడా అదే స్ధాయిలో యాక్షన్..ఎంటర్టైన్మెంట్ కలిపి ఉంటుందని చెప్తున్నారు. ఈ చిత్రం కోసం చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు వార్తల్లోకి వచ్చినా ఆ అదృష్టం సమంతనే వరించింది. అలాగే ఈ చిత్రానికి ఎప్పటిలాగే దేవిశ్రీప్రాసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్ మురెళ్ళ కెమెరా వర్క్, జులాయి నిర్మాత రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

English summary

 Prominent Telugu film writer and director Trivikram Srinivas was given Jandhyala memorial award. The award has been constituted to commemorate Telugu film director Jandhyala and given to outstanding personalities in the literary and cultural arena.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu