శ్రీదేవి కూతురు జాహ్నవి ఫస్ట్ మేగజైన్ ఫోటో షూట్.... సెక్సీ లుక్‌ అదరహో!

By Bojja Kumar

శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ త్వరలో 'ధడక్' సినిమా ద్వారా తెరంగ్రేటం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ తరం హీరోయిన్ అంటే నటనతో పాటు అభిమానులను ఆకట్టుకునేలా అందాల ప్రదర్శన చేయడం తప్పనిసరి. జాహ్నవి కూడా ఇదే దారిలో ప్రయాణిస్తోంది. తన తొలి సినిమా విడుదలకు ముందే ప్రఖ్యాత వోగ్ మేగజైన్ జూన్ సంచిక కవర్ పేజీ కోసం అందాలు ఆరబోసే అవకాశం దక్కించుకుంది. జాహ్నవి హాట్ హాట్ ఫోజులు, సెక్సీ ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

తల్లి బాటలోనే తనయ

తల్లి బాటలోనే తనయ

శ్రీదేవి బాలీవుడ్ చిత్రసీమలోకి అడుగు పెట్టిన సమయంలో గ్లామర్ పరంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆమె పలు సినీ మేగజైన్ల కోసం ఫోటో షూట్లలో పాల్గొనడం ద్వారా మరింత పాపులర్ అవ్వడంతో పాటు ఎంతో మంది కలల రాణిగా మారిపోయారు. ఇపుడు తల్లి బాటలోనే ఆమె తనయ జాహ్నవి కపూర్ కూడా ప్రయాణిస్తోంది. గతంలో తల్లితో కలిసి పలు ఫొటోషూట్లలో పాల్గొన్నప్పటికీ హీరోయిన్‌ హోదాలో సోలో ఫొటోషూట్లో జాహ్నవి పాల్గొనడం ఇదే తొలిసారి.

 ఫ్యూచర్ బాలీవుడ్ సెన్సేషన్

ఫ్యూచర్ బాలీవుడ్ సెన్సేషన్

ఫ్యాషన్ పరంగా, గ్లామర్ పరంగా జాహ్నవి కపూర్ సెన్సేషన్ సృష్టించడం ఖాయం అని, గ్లామర్ క్వీన్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీని ఆమె ఏలుతుందని, ఆ రోజులు ఎంతో దూరంలో లేవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జాహ్నవికి రోజు రోజుకు పెరుగుతున్న పాపులారిటీ

జాహ్నవికి రోజు రోజుకు పెరుగుతున్న పాపులారిటీ

జాహ్నవి కపూర్ నటించిన తొలి సినిమా ఇంకా విడుదలకు ముందే సోషల్ మీడియా ద్వారా బోలెడు పాపులారిటీ వచ్చింది. అతి తక్కువ కాలంలోనే జాహ్నవి బాలీవుడ్లో టాప్ పొజిషన్‌కు ఎదుగుతుందనడానికి ఇదొక చక్కని ఉదాహణగా పేర్కొంటున్నారు.

పోటీ పడుతున్న డిజైనర్లు

పోటీ పడుతున్న డిజైనర్లు

ఫ్యాషన్‌ సెన్సేషన్‌గా జాహ్నవికి గుర్తింపు వస్తుండటంతో ప్రముఖ డిజైనర్లు ఆమె కోసం పోటీ పడుతున్నారు. ఇటీవల అమెరికాకు చెందిన హాలీవుడ్ డిజైనర్ జాహ్నవిని తన క్లయింటుగా చేర్చుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.

అమ్మ లేని లోటు తీర్చలేనిది

అమ్మ లేని లోటు తీర్చలేనిది

తల్లి మరణంపై జాహ్నవి మాట్లాడుతూ... ‘అమ్మను కోల్పోయాం. ఆ లోటు మా జీవితాల్లో ఎప్పటికీ తీరదు. నాకు ఇలాంటి తల్లిదండ్రులు దొరికినందుకు గర్వంగా ఉంది. నేను కూడా వాళ్లని గర్వపడేలా చేయాలి. ఆ ఆలోచనే నన్ను ముందుకు నడిపిస్తోంది.' అని జాహ్నవి తెలిపారు.

కుటుంబం ఒక్కటైంది

కుటుంబం ఒక్కటైంది

‘అమ్మ వెళ్లిపోయాక మా కుటుంబం అంతా ఒక్కటైంది. అన్నయ్య అర్జున్‌, అక్క అన్షులా మమ్మల్ని సొంత తోబుట్టువులుగా చూసుకుంటున్నారు. ఇది నాలో మరింత ధైర్యాన్ని నింపింది అని జాహ్నవి వెల్లడించారు.

సినిమాల విషయంలో అమ్మ చెప్పిన సూత్రాన్ని పాటిస్తా

సినిమాల విషయంలో అమ్మ చెప్పిన సూత్రాన్ని పాటిస్తా

ఏ సినిమాలో చేస్తున్నాం? ఎలాంటి పాత్రను ఎంచుకున్నాం? అన్నది ముఖ్యం కాదు. మనం ఇచ్చిన ప్రదర్శనతో ఇతరులను మెప్పించామా? లేదా? అన్నదే ముఖ్యమని అమ్మ చెప్పింది. ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ కెరీర్లో ముందుకు సాగుతాను అని జాహ్నవి తెలిపారు.

 ధడక్ మూవీ

ధడక్ మూవీ

జాహ్నవి నటిస్తున్న తొలి చిత్రం ‘దఢక్' జులై 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి కరణ్‌ జోహార్‌ నిర్మాత. మరాఠీ మూవీ ‘సైరాట్' రీమేక్‌గా రూపొందుతున్న ఈ ప్రేమకథలో జాహ్నవికి జోడీగా ఇషాన్‌ ఖట్టర్‌ నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X