జాహ్నవి కపూర్‌‌ను చుట్టుముట్టిన ఫ్యాన్స్, అలా చేసినా సహించి...

By Bojja Kumar

Recommended Video

జాహ్నవి కపూర్‌‌ను చుట్టుముట్టిన ఫ్యాన్స్, అలా చేసినా సహించి

ప్రముఖ నటి శ్రీదేవి కూతురు కావడం, 'ధడక్' సినిమా ద్వారా త్వరలో హీరోయిన్‌గా పరిచయం అవుతున్న నేపథ్యంలో జాహ్నవి కపూర్ ఫాలోయింగ్ క్రమక్రమంగా పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే. ఇలా పాపులారిటీ పెరిగిన కొద్దీ సెలబ్రిటీలకు ఇబ్బందులు సైతం పెరుగుతుంటాయి. ఎక్కడికి వెళ్లినా అభిమానులు చుట్టుముట్టడం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటివి ఇపుడు జాహ్నవి కపూర్ కూడా ఎదుర్కొంటోంది. ఇటీవల ముంబైలో జాహ్నవికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చిన్నారుల బృందంతో పాటు కొందరు ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టారు.

తాకకూడని చోట తాకి ఇబ్బంది పెట్టిన వైనం

చుట్టూ చేరిన అభిమానులు జాహ్నవి కపూర్‌‌ను చూసి సందడి చేశారు. అయితే కొందరు ఆమెను తాక కూడని చోట తాకడంతో జాహ్నవి ఇబ్బంది పడినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. తన తల్లిలాగే శాంత స్వభావం గల జాహ్నవి ఏ మాత్రం కోపానికి రాకుండా ఆ ఇబ్బందిని సహిస్తూనే కారెక్కింది.

జాహ్నవికి మరింత సెక్యూరిటీ పెంచుతారా?

జాహ్నవికి మరింత సెక్యూరిటీ పెంచుతారా?

ఈ సంఘటన తర్వాత జాహ్నవికి సెక్యూరిటీ మరింత పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. జాహ్నవి విషయంలో ఆమె సోదరుడు, హీరో అర్జున్ కపూర్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇటీవల మీడియాలో జాహ్నవి గురించి వచ్చిన కొన్ని ఛీప్ ఆర్టికల్స్ మీద అర్జున్ కపూర్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

తల్లి విషాదం నుండి కోలుకుని

తల్లి విషాదం నుండి కోలుకుని

జాహ్నవి కపూర్ తన తల్లి శ్రీదేవి మరణానికి సంబంధించిన విషాదం నుండి కోలుకుని సినిమా షూటింగుల్లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం జాహ్నవి ధడక్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.

ధడక్ మూవీ

ధడక్ మూవీ

ధడక్ చిత్రానికి ‘శశాంక్ ఖైతాన్' దర్శకత్వం వహిస్తున్నారు. మరాఠీ మూవీ సైరాట్ చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో జాహ్నవి, ఇషాన్ ఖట్టర్ జంటగా నటిస్తున్నారు. జులై 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X