శ్రీదేవి, జాహ్నవి కెవ్వు కేక.. ఇఫీలో సందడి చేసిన తల్లికూతుళ్లు
Recommended Video

గోవాలో ప్రారంభమైన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ2017)లో అలనాటి అందాల తార శ్రీదేవి, ఆమె కూతురు జాహ్నవి కపూర్ హల్‌చల్ చేశారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో బోనికపూర్, శ్రీదేవి, జాహ్నవి కపూర్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీదేవి బంగారు రంగులో చీరలో మెరువగా, డిజైన్డ్ లంగా పరికిణిలో జాహ్నవి ఆకట్టుకొన్నారు.
ఇఫీ2017లో శ్రీదేవి, జాహ్నవి హంగామా
ఇఫీ2017 ప్రారంభవేడుకలో దేశ విదేశాలకు చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి కూతురు ఇలా దర్శనమిచ్చింది. తన అందచందాలతో అబ్బురపరిచింది. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బోనితో కలిసి హడావిడి
ప్రారంభ వేడుక అనంతరం మీడియా పాయింట్ వద్ద బోనికపూర్ కుటుంబం హడావిడి చేసింది. ఈ కుటుంబాన్ని కెమెరాలో బంధించడానికి ఫొటో జర్నలిస్టులు ఎగబడ్డారు. ఫోటో జర్నలిస్టుల కోరిక మేరకు శ్రీదేవి దంపతులు ఇలా ఫొటోకు ఫొజిచ్చారు.
షారుక్, పారికర్‌తో కలిసి శ్రీదేవి
ఇఫీ2017 వేడుకల్లో ప్రముఖ నటి శ్రీదేవి ఇండియన్ పనోరమా విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులను ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, కేంద్రమంత్రి మనోహర్ పారికర్ తదితరులు పాల్గొన్నారు.
అందాల తార శ్రీదేవి రాకతో
ఇఫీ2017 వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. తాను ఈ వేడుకల్లో పాల్గొనడం ద్వారా కార్యక్రమానికి ఎంతో శోభను కలిగించింది అని ఇఫీ ట్వీట్ చేసింది.

సైరత్ రీమేక్‌తో జాహ్నవి బాలీవుడ్ ఎంట్రీ
ఇలా ఇఫీలో హంగామా చేసిన జాహ్నవి కపూర్ త్వరలోనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నది. కరణ్ జోహర్ నేతృత్వంలో మరాఠీ చిత్రం సైరాత్ హిందీ రీమేక్ దడక్ చిత్రంలో జాహ్నవి నటించనున్నది. ఈ చిత్రాన్ని 2018 జూలై 6న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











