Devara: ఎన్టీఆర్ మూవీలో మెయిన్ ట్విస్ట్ లీక్.. జాన్వీ కపూర్, శ్రీకాంత్ రోల్స్‌పై నోరు జారిన నటుడు

కొంత కాలంగా టాలీవుడ్‌లో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ టాప్ హీరోగా దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు RRRతో తన రేంజ్‌ను ఆస్కార్ ప్రెడిక్షన్ లిస్టుకు చేర్చుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఈ నందమూరి హీరో తన 30వ చిత్రం 'దేవర'ను చేస్తున్నాడు. టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే.

కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చి నెలలోనే మొదలు పెట్టారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. అయితే, దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ పార్ట్ షూట్ 80 శాతం వరకూ అయింది.

Recommended Video

Jr NTR Devara లో మెయిన్ Twist.. Koratala Siva ప్లానింగ్ RRR ను మించి.. | Telugu Filmibeat

Janhvi Kapoor Plays Srikanth Daughter Role in Jr NTR Devara Movie

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'దేవర' మూవీపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికితోడు ఈ మధ్య ఈ చిత్రం గురించి వస్తున్న లీక్స్ వీటిని మరింతగా పెంచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ను న్యూ ఇయర్ కానుకగా ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్విస్టులు లీక్ అయ్యాయి.

'దేవర' మూవీలో నటిస్తోన్న ఓ ఆర్టిస్టు తాజాగా యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఈ సినిమాలోని ఎన్నో విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా నోరు జారి మరీ కొన్ని ట్విస్టులను లీక్ చేశాడు. 'దేవర మూవీ అదిరిపోతుంది. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవబోతుంది. నేను 60 రోజులు వర్క్ చేశా. ఫిబ్రవరి వరకూ ఈ షూట్ జరుగుతుంది' అని చెప్పాడు.

ఆ తర్వాత సదరు నటుడు 'నేను శ్రీకాంత్ అన్నయ్య పక్కన ఉంటాను. ఆయనతో పాటు హీరో గారు (ఎన్టీఆర్), సైఫ్ అలీ ఖాన్ గారు, దసరా విలన్ చాకో వీళ్లంతా ఓ గ్రూప్‌గా ఉంటారు. వీళ్లలో జాన్వీ కపూర్.. శ్రీకాంత్ గారి కూతురిగా చేస్తోంది. ఈ సినిమా వేరే ప్రపంచం. ఇప్పటి వరకూ చూసిన వాటికి భిన్నంగా ఉండబోతుంది' అంటూ ఈ సినిమాలోని కోర్ పాయింట్‌, ట్విస్ట్‌ను లీక్ చేశాడు.

ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X