విజయ్ దేవరకొండపై జాన్వీ కపూర్ హాట్ కామెంట్.. ఉదయం లేవగానే, కరణ్ జోహార్ ప్రశ్న!

Recommended Video

Janhvi Kapoor Reveals One Male Actor She Would Like To Wake Up As. Hint: He’s Not From Bollywood

శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ తన డెబ్యూ మూవీతో ఆకట్టుకుంది. ఇషాన్ ఖట్టర్ తో జంటగా నటించిన దఢక్ చిత్రంతో జాన్వీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. లుక్, నటన పరంగా జాన్వీ సినీ విమర్శకులని, ప్రేక్షకులని మెప్పించింది. ప్రస్తుతం జాన్వీ తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టింది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షో బాగా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు ఈ షోలో పాల్గొంటున్నారు. ఇటీవల అర్జున్ కపూర్, జాన్వీ కాఫీ విత్ కరణ్ షోకు గెస్ట్ లుగా హాజరయ్యారు.

 విజయ్ దేవరకొండ గురించి

విజయ్ దేవరకొండ గురించి

ఈ షోలో రాపిడ్ ఫైర్ లో భాగంగా కరణ్ జోహార్.. జాన్విని ఓ ప్రశ్న అడిగారు. ఒక రోజు ఉదయం నిద్రలేవగానే పురుషుడిగా మారిపోవాలంటే ఏ నటుడ్ని ఎంచుకుంటావు అని అడిగాడు. దీనికి జాన్వీ కపూర్ తడుముకోకుండా.. విజయ్ దేవరకొండ అంటూ సమాధానం ఇచ్చింది. అంతే కాదు తనతో సినిమా చేయాలనే కోరికని కూడా బయట పెట్టింది.

 సెక్సీ స్టార్

సెక్సీ స్టార్

జాన్వీ సమాధానం విన్న తరువాత కరణ్ జోహార్ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడారు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రంతో స్టార్ గా మారాడని తెలిపారు. ఆ చిత్రాన్ని ప్రస్తుతం హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. విజయ్ దేవరకొండ సెక్సీ సౌత్ ఇండియన్ స్టార్ అంటూ కరణ్ జోహార్ కితాబిచ్చేశారు. ఈ షోతో జాన్వీ కపూర్, విజయ్ దేవరకొండ చిత్రం గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

కరణ్ జోహార్ నిర్మాణంలో

కరణ్ జోహార్ నిర్మాణంలో

టాక్సీవాలా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాను కరణ్ జోహార్ ని ఆయన నివాసంలో కలిసినట్లు విజయ్ తెలిపాడు. ఇప్పుడు జాన్వీ కపూర్, కరణ్ జోహార్ ఈ సంచలన టాలీవుడ్ హీరోని ప్రశంసించడం చూస్తుంటే.. వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతోందా అనే వార్తలు వస్తున్నాయి. తాను బాలీవుడ్ లో నటించడానికి కూడా సిద్ధం అంటూ విజయ్ దేవరకొండ ప్రకటించిన సంగతి తెలిసిందే.

దూసుకుపోతున్న టాక్సీవాలా

దూసుకుపోతున్న టాక్సీవాలా

విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రం ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దీనితో విజయ్ ఈ ఏడాది రెండవ విజయం అందుకున్నాడు. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అతిలోక సుందరి కుమార్తె, విజయ్ దేవరకొండ చిత్రానికి ఎప్పుడు ముహూర్తం కుదురుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X