ఎంట్రీకి ముందే అదగొడుతున్న జాహ్నవి.. టెంపర్ రీమేక్‌లో.. హీరో ఎవరంటే..

అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాహ్నవి కపూర్ బాలీవుడ్ ఎంట్రీ అధికారికంగా ఖారారైంది. దడక్ ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకుల హృదయాల్లో దడ పుట్టిస్తున్నది.

By Rajababu

Recommended Video

ఎంట్రీకి ముందే అదగొడుతున్న జాహ్నవి

అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాహ్నవి కపూర్ బాలీవుడ్ ఎంట్రీ అధికారికంగా ఖారారైంది. దడక్ ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకుల హృదయాల్లో దడ పుట్టిస్తున్నది. బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ నేతృత్వంలో జాహ్నవి కపూర్ హిందీ చిత్ర సీమకు పరిచమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కరణ్ బుధవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాడు. జాహ్నవి, ఇషాన్ కట్టర్‌తో కూడిన ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే సినిమా ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నట్టు సమాచారం..

మరాఠీ చిత్రం సైరత్ దేశవ్యాప్తంగా సంచలన విజయం

మరాఠీ చిత్రం సైరత్ దేశవ్యాప్తంగా సంచలన విజయం

సాధించింది. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకొన్న ఓ యువతి, యువకుడి ప్రేమ కథ ప్రేక్షకలను విశేషంగా ఆకట్టుకొన్నది. దాంతో ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. ఈ చిత్ర సగభాగం మొత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుకొన్నది. నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రింకూ రాజ్‌గురు, ఆకాశ్ థోసర్ నటించారు.

 సైరత్ హీరో హీరోయిన్ల ఎంపిక..

సైరత్ హీరో హీరోయిన్ల ఎంపిక..

రింకూ సినిమా పరిచయం చాలా గమ్మత్తుగా జరిగింది. మహారాష్ట్రలోని అక్లూజ్ గ్రామానికి చెందిన రింకూ ఏడో తరగతి చదువుతుండగా, తన తల్లితో కలిసి ఓ దర్శకుడిని కలిసింది. వాస్తవానికి డాక్టర్ కావాలనుకొన్న రింకూ యాక్టర్‌గా మారింది. అలాగే ఆకాశ్‌ను నాగరాజ్ ఓ బస్టాప్‌లో చూసి తన చిత్రంలో హీరోగా ఎంపిక చేసుకొన్నారు. వీరు పోషించిన పాత్రలను ప్రస్తుతం హిందీలో శ్రీదేవి కూతురు జాహ్నవి, షాహీద్ కపూర్ సోదరుడు ఇషాన్ పోషిస్తున్నారు.

జూలై మొదటి వారంలో దడక్

జూలై మొదటి వారంలో దడక్

దడక్ చిత్రం డిసెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనున్నది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూలై మొదటివారంలో రిలీజ్ చేసేందుకు కరణ్ జోహర్ ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా మొదటి సినిమా రిలీజ్ కాకముందే జాహ్నవి కపూర్‌కు కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం.

 టెంపర్ రీమేక్‌లో జాహ్నవి

టెంపర్ రీమేక్‌లో జాహ్నవి

తెలుగులో ఘనవిజయం సాధించిన టెంపర్ చిత్రం రీమేక్‌లో జాహ్నవి కపూర్ నటిస్తున్నారనే వార్త బాలీవుడ్‌లో గుప్పుమంటున్నది. గోల్‌మాల్ అగైన్‌తో 200 కోట్ల క్లబ్‌లో చేరిన దర్శకుడు రోహిత్ శెట్టి టెంపర్ రీమేక్ డైరెక్టర్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించనున్నాడు.

 పెదవి విప్పని రోహిత్ శెట్టి

పెదవి విప్పని రోహిత్ శెట్టి

జాహ్నవి హీరోయిన్‌గా ఎంపిక చేశారనే వార్తపై రోహిత్ శెట్టి మాట్లాడటానికి నిరాకరించినట్టు సమాచారం. అయితే టెంపర్ రీమేక్‌పై ఆయన స్పందించారు. తెలుగులో రూపొందిన కథలో 20 శాతం మాత్రమే హిందీలోకి తీసుకొంటున్నాం. మిగితా కథ బాలీవుడ్ ప్రేక్షకులకు అభిరుచికి అనుగుణంగా మార్చుకుంటాం అని రోహిత్ శెట్టి పేర్కొన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను వచ్చే ఏడాదిలో మొదలుపెట్టి.. డిసెంబర్‌లో రిలీజ్ చేస్తామని ఆయన చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X