కీర్తి సురేష్‌పై జాన్వీకపూర్ కామెంట్.. థ్రిల్లింగ్ రియాక్షన్
దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే జాతీయ చలన చిత్ర అవార్డు విజేతల వివరాలు నిన్న(శుక్రవారం) ప్రకటించబడ్డాయి. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించిన ఈ లిస్ట్‌లో బెస్ట్ హీరోయిన్ కేటగిరీలో కీర్తి సురేష్ అవార్డు దక్కించుకుంది. దీంతో కీర్తి సురేష్‌ని అభినందిస్తూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి జాన్వీకపూర్, కీర్తి సురేశ్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.
''జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న కీర్తి సురేశ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీకు ఈ అవార్డు రావడం పట్ల చాలా థ్రిల్‌గా ఫీల్ అయ్యాను'' అని జాన్వీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పటికే టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు ఎందరో కీర్తి సురేష్‌ని, మహానటి సినిమాను అభినందిస్తుండగా.. తాజాగా బాలీవుడ్ నటి, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రశంసలు దక్కడం పట్ల ఆనందంగా ఉన్నారు మహానటి యూనిట్ సభ్యులు.

ఇక మరో విశేషమేమిటంటే.. బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారత ఫుట్‌బాల్ ఆటగాడు, కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో పలు దక్షిణాది చిత్రాల హవా కొనసాగింది. టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర సత్తా దేశానికి తెలిసింది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి పలు సినిమాలకు గాను వేరు వేరు కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. 'మహానటి' సినిమా ఉత్తమ చిత్రంగా సెలెక్ట్ కాగా, అదే సినిమాకు గాను ఉత్తమ హీరోయిన్ కేటగిరీలో కీర్తి సురేష్ అవార్డు దక్కించుకుంది. అదేవిధంగా రంగస్థలం, చిలసౌ, అ! చిత్రాలు వివిధ కేటగిరీల్లో అవార్డులు పొందాయి.


Click it and Unblock the Notifications











