నాపై పుకార్లు.. జనసేనానిపై నోటికొచ్చినట్టు రాస్తారా? రేవ్ పార్టీపై జానీ మాస్టర్ కౌంటర్

బెంగళూరులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుట్టు రట్టు చేసిన రేవ్ పార్టీ అనేక మలుపులు తిరుగుతున్నది. అయితే ఆ పార్టీపై మెరుపు దాడులు చేసిన పోలీసులు కొందర్నీ అదుపులోకి తీసుకొన్నారు. ఈ సందర్భంగా వీడియోలు, ఫోటోలో కొందరు సినీ ప్రముఖుల ముఖాల మాదిరిగా కనిపించడంతో వారి పేర్లను మీడియాలో బహిర్గతం చేశారు.

అలా బయటకు వచ్చిన పేర్లలో జనసేన పార్టీ నేత, ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఒకరు. అయితే తనతోపాటు జనసేనాని పేరుతో కామెంట్లు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వీడియోతో క్లారిటీ ఇచ్చారు. ఆయన చెప్పిన విషయాల్లోకి వెళితే..

Jani Master Clartiy on Bangalore Rave Party participation Video Released

బెంగళూరు రేవ్ పార్టీలో తాను ఉన్నట్టు వస్తున్న వార్తలను జానీ మాస్టర్ ఖండించారు. నేను గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో నా వాళల్ మధ్య తీరిక లేకుండా మా వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉన్నాను. నేను ఎవరితో ఎక్కడ? ఏదో కనిపించానని పుకార్లు రేపుతున్నారు. మా జనసేన పార్టీని, జనసేనాని ఉద్దేశించి నోటికొచ్చినట్టు రాస్తున్నారు అని ఆవేదన చెందారు.

ఆదివారం (మే 20వ తేదీ) రోజున తెలుగు సినిమా పరిశ్రమ ఘనంగా జరుపుకొన్న డైరెక్టర్స్ డే ఈవెంట్‌లో నేను పాల్గొన్నాను. అలాగే సోమవారం నా స్నేహితుడిని కలువడానికి హాస్పిటల్‌కు వెళ్లాను. ఇప్పటి వరకు నేను అసోసియేషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నేను బెంగళూరులో ఎలా ప్రత్యక్షమయ్యానో.. ఈ వార్తను ఎలా పుట్టించాలరో మతిలేని మహారథులకే తెలియాలి అన్నారు.

ఏదైనా సూటిగా, నేరుగా ఎదుర్కొలేని వాళ్లు.. చేతకానోడు చెడగొట్టడానికే చూస్తాడు. ఈ వివరణ ఇస్తున్నది.. నేను ఏదో తప్పు చేశానని కప్పి పుచ్చుకోవడానికి, నాపై దుష్ఫ్రచారం చేస్తున్న వాళ్లకు కౌంటర్ ఇవ్వడానికో కాదు. నన్ను వాళ్లలో ఒక కుటుంబ సభ్యుడినని అనుకొనే వాళ్ల కోసం ఈ వివరణ ఇస్తున్నాను అంటూ వీడియోలతో ఓ మేసేజ్ పోస్టు చేశారు.

జానీ మాస్టర్ వీడియోను షేర్ చూస్తూ.. నేను హైదరాబాద్‌లో డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఉన్నాను. ముక్కు రాజు గారు స్థాపించిన ఈ అసోసియేషన్ పనుల్లో ఉన్నాను. అయితే రేవ్ పార్టీలో ఉన్నానని వార్తలు వస్తున్నాయి. ఎన్నికల తర్వాత నేను హైదరాబాద్‌లో ఉన్నాను. డైరెక్టర్ డే లైవ్‌లో నన్ను చూసి ఉంటారు. నాపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. జై జనసేన అంటూ వీడియో షేర్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X