సాంగ్సే కాదు.. కలెక్షన్లు కూడా కోట్ల రేంజ్‌లో.. హీరోగా జానీ మాస్టర్ ఎంట్రీపై యాంకర్ ప్రదీప్
దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రభుదేవా, లారెన్స్ మాస్టర్ తర్వాత మరో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా మారిపోయారు. సుజి విజువల్స్ బ్యానర్‌పై మురళిరాజ్ తియ్యాన దర్శకత్వంలో నిర్మాత కే వెంకటరమణ నిర్మిస్తున్న చిత్రంలో హిప్పీ ఫేం దిగంగన సూర్యవంశీతో కలిసి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభ వేడుక ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్, నటుడు నాగబాబు చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్, ప్రముఖ యాంకర్ ప్రదీప్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ మాట్లాడుతూ..
ఘాటైన అందాలతో హీరోయిన్ వేదిక.. మీరు ఎప్పుడూ చూడని హాట్ ఫోటోలు

స్టార్ కొరియోగ్రాఫర్ హీరోగా
ఇప్పటి వరకు జానీ మాస్టర్ డ్యాన్స్ తెర మీద మాత్రమే చూశాం. అలాంటి స్టార్ కొరియోగ్రాఫర్ హీరోగా పరిచయం అవుతున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. కెమెరా వెనుక చాలా ఎనర్జీగా ఉంటారు. ఇక ముందు అదే ఎనర్జీని తెరపైన చూసేందుకు ఎదురు చూస్తున్నాం అని యాంకర్ ప్రదీప్ అన్నారు.

తెరపైన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో
కొరియోగ్రాఫర్‌గా అద్బుతమైన విజయాన్ని అందుకొన్నారు. హీరోగా కూడా ప్రేక్షకులతో నీరాజనాలు అందుకోవాలని ఆకాక్షిస్తున్నాను. సినిమా పరిశ్రమలో అన్ని విభాగాలపై జానీ మాస్టర్ మంచి అవగాహన ఉంది. ఇప్పటి వరకు డ్యాన్స్‌లో టాలెంట్ చూశాం. ఇక ముందు ఆయన యాక్టింగ్, పవర్ఫుల్ డైలాగ్స్‌ను తెర మీద చూడాలని ఉంది అని ప్రదీప్ పేర్కొన్నారు.

జానీ మాస్టర్ పాటలకు రికార్డుస్థాయి వ్యూస్
ఇటీవల కాలంలో జానీ మాస్టర్ కొరియోగ్రఫి అందించిన పాటలు రికార్డు స్థాయిలో కోట్లాది వ్యూస్ సాధించాయి. ఆయన నటించే చిత్రాలు కూడా ఆయన సాధించిన రికార్డు వ్యూస్ మాదిరిగా ఆయన నటిస్తున్న తొలి సినిమా కలెక్షన్లు కూడా ఆ రేంజ్‌లో సాధించాలని కోరుకొంటున్నాను అని ప్రదీప్ అభిప్రాయపడ్డారు.

యాంకర్ ప్రదీప్‌కు జానీ మాస్టర్..
తాను హీరోగా నటిస్తున్న తొలి సినిమా ప్రారంభ వేడుకకు వచ్చిన యాంకర్ ప్రదీప్‌కు జానీ మాస్టర్ థ్యాంక్స్ చెప్పారు. తనతో ఎప్పుడూ సన్నిహితంగా ఉంటూ.. తనను ఎల్లవేళలా ప్రోత్సహించే ప్రదీప్ ఈ వేడుకకు రావడం మరింత ఆనందంగా ఉంది. ప్రదీప్ విషెస్ అందిచడం మరీ సంతోషాన్ని కలిగించింది అంటూ జానీ మాస్టర్ పేర్కొన్నారు.

యాక్టర్స్, టెక్నీషియన్స్
నటీనటులు: జానీ మాస్టర్, దిగంగన సూర్యవంశీ తదితరులు
నిర్మాత: వెంకటరమణ కే
దర్శకత్వం: మురళిరాజ్ తియ్యాన
సినిమాటోగ్రాఫర్: శ్యామ్ కే నాయుడు
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
సంగీత దర్శకుడు: రధాన్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రాంతేజ్ చిట్టిబొమ్మ
ఆర్ట్: డైరెకట్ర్: పీవీ రాజు
డైలాగ్స్: యశోద గౌరీ శంకర్
పీఆర్‌వో: పులగం చిన్నారయణ
డిజిటల్ పబ్లిసిటి: సుధీర్ తెలప్రోలు
బ్యానర్: సుజి విజువల్స్
Recommended Video
యువ హీరోయిన్ సంజనా లేటేస్ట్ ఫోటో షూట్.. వైరల్ పిక్స్


Click it and Unblock the Notifications











