Bail for Jani Master: జానీ మాస్టర్‌కు ఊరట.. లైంగిక వేధింపుల కేసులో బెయిల్‌

Bail for Jani Master: కొరియోగ్రాఫర్ మాస్టర్ జానీ మాస్టర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న జానీ మాస్టర్ కు కాస్త ఊరట లభించింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్‌ బెయిల్ పిటిషన్ ను నేడు తెలంగాణ హైకోర్టు విచారించింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. జానీ మాస్టర్ కు హైకోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది.

గత ప‌ది రోజుల క్రితమే నేషనల్ అవార్డు అందుకోవడం కోసం జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. కానీ, జానీ మాస్టర్ పై పోక్సో చ‌ట్టం కింద కేసు నమోదు కావడంతో ఆయ‌న‌కు వ‌చ్చిన అవార్డును క‌మిటీ తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో జానీ మాస్టర్ కు వచ్చిన బెయిల్ ను ర‌ద్దు చేసింది.దీంతో జానీ మాస్ట‌ర్ జైలుకు
తరలిచారు.

Choreographer Jani Master has been granted bail in the case of sexual harassment case

ఈ నేప‌థ్యంలో మరో సారి తెలంగాణ హైకోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేశారు. జానీ మాస్టర్ కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. అన్ని ఫార్మాలిటిస్ పూర్తి అయినా తరువాత గురువారం (ఈ రోజు) సాయంత్రం వ‌ర‌కు జానీ మాస్ట‌ర్ విడుదలయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

జానీ మాస్టర్ తనను బెదిరించి పలుమార్లు లైంగిక వేధింపులకు గురి చేశారని, తాను మైనర్ బాలికగా ఉండగా ముంబైలోని ఓ హోటల్‌లో అత్యాచారం చేశారని జానీ మాస్టర్‌ వద్ద పనిచేసిన మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఈ కేసును నార్సింగి పోలీసులకు అప్పగించారు.దాంతో జానీ మాస్టర్‌ను స్పెషల్ టీం గోవాలో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

ఈ తరుణంలో రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప్పర్‌పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు హాజరుపరిచారు. ఇరు వాదన విన్న కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో చంచల్‌గూడ్ జైలుకు తరలించారు. దాదాపు నెల రోజుల క్రితం అరెస్ట్ అయినా జానీ మాస్టర్ రెండు వారాలుగా జైలులో గడిపారు.

ఈ రెండు వారాల్లో జానీ మాస్టర్ బెయిల్ కోసం అనేక సార్లు దరఖాస్తులు చేసుకున్నా కోర్టు మాత్రం నిరాకరించింది. పోక్సో నమోదుతో ఇన్ని రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. ఆయనకు ఈరోజు బెయిల్ లభించడంతో చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. ఎట్టకేలకు జానీ మాస్టర్ కు బెయిల్ లభించడంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: bail jani master sexual assault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X