అరవింద సమేత: జానీ మాస్టర్ ట్వీట్‌‌తో ఎన్టీఆర్ అభిమానుల్లో మరింత జోష్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ మూవీ 'అరవింద సమేత' షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ జరుగుతోంది. జానీ మాస్టర్ సమక్షంలో కలర్‌ ఫుల్ సాంగ్ షూట్ చేస్తున్నారు. సెట్స్‌లో ఎన్టీఆర్, త్రివిక్రమ్‌తో కలిసి దిగిన ఫోటోలను ఈ సందర్భంగా జానీ మాస్టర్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. జానీ మాస్టర్ ట్వీట్‌తో అభిమానుల్లో 'అరవింద సమేత' పై అంచనాలు మరింత పెరిగాయి. గతంలో జానీ మాస్టర్-ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన డాన్స్ నెంబర్స్ హిట్టయిన సంగతి తెలిసిందే.

లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ఇద్దరితో....

లాంగ్‌గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ సర్, త్రివిక్రమ్ సర్‌తో కలిసి చేస్తున్నాను. సాంగ్ ఔట్ పుట్ అద్భుతంగా రావడం మంరింత సంతోషాన్ని ఇచ్చింది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ జానీ మాస్టర్ ట్వీట్ చేశారు.

జోరందుకున్న ప్రమోషన్స్

జోరందుకున్న ప్రమోషన్స్

‘అరవింద సమేత' చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 11న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్‌కు మంచి స్పందన వచ్చింది. త్వరలో ట్రైలర్ రిలీజ్ డేసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నారు.

Recommended Video

Aravindha Sametha Movie Working Stills Goes Viral
అభిమానులకు విందు భోజనంలా...

అభిమానులకు విందు భోజనంలా...

‘అరవింద సమేత వీర రాఘవ' చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ అభిమానులకు ఒక విందు భోజనంలా అందించబోతున్నారు. యాక్షన్, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్, కామెడీ ఎలిమెంట్స్ కలగలిపి పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు. ఎన్టీఆర్‌తో చేస్తున్న తొలి చిత్రం కావడంతో... ఆయన ఫ్యాన్స్ ఎలాంటి సినిమా ఇష్టపడతారో రీసెర్చ్ చేసి మరీ త్రివిక్రమ్ అందుకు తగిన విధంగా సినిమాను తీర్చిదిద్దారట.

ఈ దసరా అరవింద సమేతమయమే

ఈ దసరా అరవింద సమేతమయమే

ఈ దసరాకు ఎన్టీఆర్ ‘అరవింద సమేత' తప్ప ఇతర పెద్ద హీరోల సినిమాలేవీ లేవు. ఈ నేపథ్యంలో ఈ దసరా మొత్తం అరవింద సమేతమయం ఖాయం అంటున్నారు అభిమానులు. అక్టోబర్ మొదటి వారంలో ‘అరవింద సమేత' ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ నిర్వహించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X