నా మొగుడి పై మనసు పారేసుకుంది .. శ్రేష్టి వర్మ పై జానీ మాస్టర్ భార్య షాకింగ్ కామెంట్స్
Jani master.. టాలీవుడ్ ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani master)పై శ్రేష్టి వర్మ అనే అమ్మాయి లైంగిక వేధింపుల కేసు పెట్టడం, ఈకేసులో జైలుకు వెళ్లడం, నెల రోజుల పాటు జైలులో ఉండడం, ఆ తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు రావడం, ఈ కేసు కారణంగా ఆయనకి వచ్చిన నేషనల్ అవార్డును నిలిపివేయడం వంటి ఘటనలు అందరికీ తెలిసిందే. ఈ కేసు ఇండస్ట్రీలో దుమారం రేపిన విషయం తెలిసిందే. బయటకి వచ్చిన తర్వాత జానీ మాస్టర్ తాజా ఎలాంటి తప్పు చేయలేదని, తనపై కుట్ర చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. జానీ మాస్టర్ వ్యాఖ్యలను శ్రేష్టి వర్మ ఖండించి, తన భార్యపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా శ్రేష్టి వ్యాఖ్యలకు కౌంటర్ వేస్తూ.. జానీ మాస్టర్ భార్య సుమలత ( ఆయేషా)పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఏమన్నదంటే..?
హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జానీ మాస్టర్ బయటకు వచ్చారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న అయితే ఆయన కేసు నుండి బయటకు వచ్చి గత కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. మళ్లీ సినిమా అవకాశాలు రావడంతో షూటింగ్లలో బిజీగా మారిపోయారు జానీ మాస్టర్. అయితే మరోవైపు జానీ మాస్టర్ శ్రేష్ఠి వర్మ కలిసి చేసిన డ్యాన్సులు వైరల్ కావడం, కొందరు సినీ ప్రముఖులు శ్రేష్టి వర్మపై ఆరోపణ చేయడం తో సృష్టి వర్మ సడన్ గా ఓ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూలో జానీ మాస్టర్, అతని భార్య సుమలత పై సంచలన వ్యాఖ్యలు చేసింది. జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేస్తున్న విషయం తెలుసునని, జానీ మాస్టర్ అల్లుడు సమీర్ తనపై కావాలని అసభ్యకర ఆరోపణలు చేశాడని మండిపడింది. అతనిపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. దీంతో మరోసారి జానీ మాస్టర్ వివాదం తెరపైకి వచ్చింది.

ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య సుమలత ( అయేషా) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రేష్టి వర్మపై షాకింగ్ కామెంట్లు చేసింది. లేడీ కొరియోగ్రాఫర్ గురించి మాట్లాడుతూ.. జానీ మాస్టర్ ఎదుగుదలను ఓర్వలేక కొందరు తనపై కుట్ర పన్నారని, కావాలని శ్రేష్టివర్మ తో ఇలాంటి కేసులు పెట్టించారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రేష్టి వర్మ.. ఢీ షో ద్వారానే జానీ మాస్టర్ కు పరిచయమందని, ఆ పరిచయం కారణంగానే తన గ్రూపులో చేర్పించుకున్నారని సుమలత చెప్పింది. అయితే జానీ మాస్టర్ పై ఆ లేడీ కొరియోగ్రాఫర్ మనసు పారేసుకుందని, మాస్టర్ తో ఆ అమ్మాయి కాస్త అతిగా ప్రవర్తించిందని, ఆ విషయం నచ్చక ఆ లేడి కొరియోగ్రాఫర్ ను తొలగించామని పేర్కొంది.
ఒకవేళ జానీ మాస్టర్ ఆమెపై ఆరేండ్లుగా లైంగిక దాడికి పాల్పడుతూ ఉంటే.. అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించింది. ఆ లేడీ కొరియోగ్రాఫర్ చెల్లి చదువు కోసం తాము సహాయం చేశామని, అలాగే డాన్స్ యూనియన్ లో సభ్యత్వం ఇప్పించింది కూడా తామేనని పలు విషయాలను చెప్పుకొచ్చింది ఆయేషా .వాస్తవానికి లేడీ కొరియోగ్రాఫర్ టాలెంట్ను గుర్తించిన జానీ మాస్టర్ తన గ్రూపులో చేర్చుకున్నారని, ఆ అమ్మాయి కష్టపడి వర్క్ చేయడంతో కాస్త ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాడని ఆ ఇంపార్టెన్స్ ను తనకు జీవితాంతం కావాలని కోరుకుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

జానీ మాస్టర్ ఆ విషయాన్ని గమనించి ఆ అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇవ్వడం తగ్గించారని, దీంతో ఆ అమ్మాయి ఇలాంటి ఆరోపణలు చేస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. జానీ మాస్టర్ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించిన తాను సేమ్ సంపాదించుకోవాలని ఇలాంటి ఆరోపణలు చేసిందని, దాదాపు ఆరేండ్లుగా తనపై లైంగిక వేధింపులు జరుగుతుంటే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని మరోసారి ప్రశ్నించింది. జానీ మాస్టర్ అలాంటి వ్యక్తి కాదని, కావాలని ఆయనపై నెగిటివిటీ చాలా స్పెడ్ చేస్తున్నారని అన్నారు. ఆయన పది మందికి ఉపయోగపడే పనులే చేశారు కానీ, ఇలాంటి పనులు చేయరని జానీ మాస్టర్ భార్య అన్నారు. ఆయన మంచితనం, టాలెంట్ ను చూసే స్టార్ హీరోలు జాని మాస్టర్ కు వరుస అవకాశాలు ఇస్తున్నారన్నారని గుర్తు చేశారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో జానీ మాస్టర్ ను అణగదొక్కాలని భావిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.


Click it and Unblock the Notifications











