twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జనతా కర్ఫ్యూ: పూరి జగన్నాథ్ కామెంట్స్.. ఇలా చేస్తే రోజంతా ఇంట్లోనే!

    |

    దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ వైరస్‌ని కట్టడి చేయడంలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మేరకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన 'జనతా కర్ఫ్యూ' పిలుపుపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ ప్రజల్లో మరింత అవగాహన తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన స్పందన తెలియజేశారు.

    ఓ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన పూరి జగన్నాథ్.. ఇంట్లో ఉండడం తమ వల్లకాదని మాట్లాడుతున్న వారికి భలే సలహా ఇచ్చారు. ఏవరైతే అన్ని గంటలు ఇంట్లో ఉండటం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో.. వాళ్లు ఆముదం తాగాలని పూరి జగన్నాథ్ చెప్పారు. నాలుగు స్పూన్ల ఆముదం తాగారంటే విరేచనాలు పట్టుకుని ఇక బయటకు రాలేరని అన్నారు. అంతేకాదు ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపును పాటించి కరోనా కట్టడిలో అందరూ భాగం కావాలని చెప్పారు.

    Janta Curfew: Puri Jagannadh comments

    ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ సాధించిన పూరి జగన్నాథ్.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా 'ఫైటర్' సినిమాను రూపొందిస్తున్నారు. ఛార్మి, పూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ముంబై షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా తదుపరి షెడ్యూల్ వాయిదా వేసుకుంది.

    English summary
    Puri Jagannadh Support for Janta CurFew. Earlier Pawan Kalyan, Chiranjeevi Supported Janta CurFew. they Released A Video Byte About PM Narendra Modi Janta CurFew Concept. He Suggests The People That Follow Modi Janta Cerfew Concept.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X