తొలి రోజే సమంతకు షాక్.. ఆన్‌లైన్‌లో 'జాను' ఫుల్ మూవీ లీక్
అక్కినేని సమంతకు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె లీడ్ రోల్ పోషించిన 'జాను' ఫుల్ మూవీ తొలి రోజే ఆన్‌లైన్‌లో లీక్ అయింది. తమిళ నాట సంచలనం సృష్టించిన 96 చిత్రాన్ని తెలుగులో జానుగా రీమేక్ చేశారు.అక్కడ విజయ్ సేతుపతి, త్రిష క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను తెలుగులో శర్వానంద్, సమంత రీ క్రియేట్ చేసేందుకు నేడు (ఫిబ్రవరి 7) ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అయితే తొలి షోతోనే ఈ మూవీ పైరసీ బారిన పడటం సినీ వర్గాలకు షాకిస్తోంది.

జాను మూవీ.. కంగారు పడుతున్న చిత్రయూనిట్
సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శర్వానంద్ రామ చంద్రన్ పాత్ర పోషించగా, జానుగా సమంత నటించింది. ఈ ఇద్దరి నటన బాగా ఆకట్టుకుందని, డైరెక్టర్ టేకింగ్ అదుర్స్ అనే టాక్ బయటకొచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ కావడం చిత్రయూనిట్‌ని కంగారు పెడుతోంది.

జాను పైరసీ.. ఫుల్ మూవీ
తొలిరోజు మొదటి షో పూర్తయ్యేసరికి జాను పైరసీ బయటకొచ్చి ఆన్‌లైన్ వేదికపై షికారు చేస్తోంది. ఇది చూసి ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకొని సినిమా చూస్తున్నారు. దీంతో ఆ ఎఫెక్ట్ సినిమాపై పడుతుందని తెలుస్తోంది.

ఏ ఒక్క సినిమాను కూడా వదలకుండా
పైరసీ భూతం విషయంలో అటు ప్రభుత్వం, ఇటు సినీ పరిశ్రమ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది. అయినా కూడా మళ్ళీ మళ్ళీ ఈ పైరసీ భూతం వెంటాడుతూనే ఉంది. ఏ ఒక్క సినిమాను కూడా వదలక పోవడంతో సినీ లోకం తీవ్ర నిరాశ చెందుతోంది. పైరసీని అరికట్టి సినిమాలను ప్రోత్సహించాలని అందరూ కోరుతున్నారు.

జాను ఎఫెక్ట్.. థియేటర్స్‌లో చూస్తే..
సాధారణంగా ఓ సినిమాను పైరసీలో చూసిన దానికి, థియేటర్ లో చూసిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ మొదలుకొని సౌండ్ ఎఫెక్ట్ వరకూ అన్నింటిలోనూ స్పష్టమైన తేడా ఉంటుంది. అది కూడా జాను లాంటి ఫీల్ గుడ్ సినిమాను థియేటర్స్‌లో చూస్తేనే అసలైన మజా ఉంటుంది.


Click it and Unblock the Notifications











