అల్లు అర్జున్ హానిమూన్ ని దెబ్బ కొట్టిన సునామి
జపాన్ లో వచ్చిన సునామి వల్ల తన హానిమూన్ ప్లాన్స్ తారుమారు అయ్యాయని అల్లు అర్జున్ అంటున్నారు. ఆయన ఈ విషయమై నేషనల్ మీడియాతో మాట్లాడుతూ..జపాన్ లో సునామి రావటంతో చాలా దేశాల్లో ఎలర్ట్ లు వచ్చాయి. దాంతో నేను అనుకున్న హానిమూన్ ట్రిప్ ను మానుకోవాల్సి వచ్చింది. అలాగే నా స్నేహితులు,సన్నిహితులు చాలామంది ఈ విషయమై నాకు మెసేజులు పంపి మరీ హెచ్చరించారు. ముఖ్యంగా నా ఆడ స్నేహితులకు ఈ విషయంలో ఎక్కువ స్పందించారు అన్నారు. ఇక తనకు స్నేహ రెడ్డికి ఎలా పరిచయం జరిగిందనే విషయం చెపుతూ కామన్ ప్రెండ్ మ్యారేజీలో ఇద్దరం కలుసుకున్నాం..
ఆ తర్వాత ఆమెకు నేను ప్రపోజ్ చేసాను. మొదట్లో మా వివాహానికి చిన్న చిన్న సమస్యలు ఎదురైనా తర్వాత అవన్నీ సమసిపోయాయి అన్నారు. ఇక మిగతా హీరోల భార్యల్లా స్నేహ తన సినిమాల విషయంలో తల దూర్చదనే అనుకుంటున్నాను అన్నారు. అందుకే ఫిల్మి బ్యాక్ గ్రౌండ్ లేని అమ్మాయిని చేసుకున్నాను అన్నారు. నా భార్యగా నా కెరీర్ గురించి ఆలోచించవచ్చేమే గానీ, నాకు తెలిసి ఉండి నా స్క్రిప్టు ,డిస్కషన్స్ లో తను తలదూర్చదు అన్నారు.


Click it and Unblock the Notifications











