జపాన్: రజనీకాంత్ తర్వాత జూ ఎన్టీఆరే అంటున్నారు!
హైదరాబాద్: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఇండియాలోనే కాదు...జపాన్ లాంటి దేశాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆయన సినిమాలు ఇక్కడి బాషలతో పాటు ఆయా దేశాల్లో వాడుకలో ఉన్న బాషల్లోకి కూడా అనువాదం అవుతూ ఉంటాయి. ఇపుడు రజనీకాంత్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అక్కడ క్రమక్రమంగా పాపులారిటీ సంపాదిస్తున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'బాద్ షా' చిత్రం ఇపుడు జపాన్ బాషలోకి అనువాదం అవుతోంది. ఈ మేరకు బాద్‌షా మూవీ మేకర్స్ జపాన్‌కు సంబంధించిన సంస్థతో అగ్రిమెంటు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. జూ ఎన్టీఆర్ డాన్స్‌ను జపనీయులు తెగ ఇష్టపడుతున్నారట.
అక్కడి టీవీ కార్యక్రమాల్లో డాన్స్ షోలలో జూ ఎన్టీఆర్ సాంగులను రీమిక్స్ చేసి మరీ వాడుతున్నారట. కేవలం ఎన్టీఆర్ నటించిన 'బాద్ షా' చిత్రం మాత్రమే కాదు, ఆయన నటించిన ఇతర చిత్రాలను కూడా కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉన్నాయట జపాన్‌కు చెందిన పలు సినిమా సంస్థలు.
ఇక ఎన్టీఆర్ సినిమాల వివరాల్లోకి వెళితే.....ప్రస్తుతం ఎన్టీఆర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'రభస'(వర్కింగ్ టైటిల్) అనే చిత్రం చేస్తున్నారు. త్వరలో ఆయన సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్లు టాక్. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట.


Click it and Unblock the Notifications












