»   » వారాహి చలన చిత్రం వారి ‘జత కలిసే’ రిలీజ్ డేట్

వారాహి చలన చిత్రం వారి ‘జత కలిసే’ రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అశ్విన్, తేజస్వి హీరో హీరోయిన్లుగా వారాహి చలన చిత్రం, ఓక్ ఎంటర్ టైన్మెంట్స్, యుక్త క్రియేషన్స్ బ్యానర్స్ పై నరేష్ రావూరి నిర్మిస్తోన్న చిత్రం ‘జత కలిసే'. ‘అలామొదలైంది' ఫేమ్ స్నిగ్ధ ఓ ప్రధానపాత్రలో నటించింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, మాటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన "రేపటి దర్శకులు" అనే కార్యక్రమంలో టాప్ టెన్ లో ఒకడిగా నిలిచి, పరుచూరి బ్రదర్స్, చిన్ని కృష్ణ వంటి స్టార్ రైటర్స్, రామ్ గోపాల్ వర్మ, గుణ శేఖర్ వంటి క్రేజీ డైరెక్టర్స్ తో వర్క్ చేసిన రాకేష్ శశి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదలవుతుంది.

జర్నీ నేపధ్యం లో సాగే లవ్ స్టోరి. ఈ సినిమాని వైజాగ్, అన్నవరం, రాజమండ్రి, రామచంద్రాపురం, రంపచోడవరం అటవీ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల లో చిత్రీకరించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను చూసిన వారాహి చలనచిత్రం అధినేత సాయికొర్రపాటిగారు, మూవీని అవుట్ రేట్ చెల్లించి సినిమాను గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు. ఆయన సినిమాను విడుదల చేస్తుండటంతో సినిమా రేంజ్ పెరిగింది. త్వరలోనే ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Jata Kalise movie release date

పృథ్వీ, షకలక శంకర్, ధనరాజ్, సప్తగిరి, రాజుగారి గది ఫేమ్ విద్యుల్లేఖ రామన్(బుజ్జమ్మ),‘జబర్ దస్త్' రాంప్రసాద్, సూర్య, ప్రియ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా మరి కొంత మంది నూతన నటీనటులు, టెక్నిషియన్స్ కూడా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి సాహిత్యం: అనంత్ శ్రీరామ్, రెహమాన్, డ్యాన్స్: శేఖర్, గణేష్, విజయ్, ఫైట్స్: జాషువ, ఆర్ట్: జె.కె.మూర్తి, పిఆర్ఓ: వంశి- శేఖర్, పబ్లిసిటీ డిజైన్స్: కృష్ణ ప్రసాద్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కెమెరా: జగదీష్ చీకటి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: వైది, సంగీతం: విక్కి, సాయికార్తీక్, నిర్మాత: నరేష్ రావూరి, రచన-దర్శకత్వం: రాకేష్ శశి.

English summary
Jata Kalise movie releasing on December 25.
Please Wait while comments are loading...