Just In
- 59 min ago
ఉగాదికి అలా రంజాన్‌కు ఇలా.. పూనమ్ కౌర్‌ను ఏకిపారేస్తోన్న నెటిజన్స్
- 1 hr ago
తండ్రితో పడుకున్నావ్ అంటోంది.. తప్పని తెలిసినా సరే.. చిన్మయి ఎమోషనల్
- 2 hrs ago
హైపర్ ఆదిపై దారుణమైన కామెంట్స్.. అలా అంటూ పరువుదీసిన నాగబాబు
- 10 hrs ago
బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
Don't Miss!
- Sports
KKR vs MI: ఆ సమయంలో ఒత్తిడి నెలకొంది.. రోహిత్ ఇచ్చిన విశ్వాసంతోనే రాణించా: చహర్
- News
రేపటితో తిరుపతిలో గప్‌చుప్-చంద్రబాబుపై దాడి, గురుమూర్తి కులం ప్రభావమెంత ?
- Finance
హోమ్‌లోన్ వడ్డీ రేట్లపై కస్టమర్లకు కొటక్ మహీంద్రా గుడ్‌న్యూస్: అందుకే.. అలాగే
- Lifestyle
Mars Transit in Gemini on 14 April: మిధునంలోకి కుజుడి ఎంట్రీతో.. ఎవరికి ప్రయోజనం.. ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఓటీటీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న జాతిరత్నాలు, ఉప్పెన.. ఆ రెండు కొత్త సినిమాలు కూడా రెడీ!
ఈ రోజుల్లో ఒక సినిమా విడుదలైతే థియేటర్స్ లలో ఎన్ని రోజులు ఉంటుందో అర్థం కావడం లేదు. హిట్ టాక్ వస్తే లాభాలు బాగానే వస్తున్నాయి. కానీ అదే యావరేజ్ టాక్ వస్తే మాత్రం వారం తిరక్కుండానే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం డిజిటల్ గా చిన్న సినిమాలకు మంచి లాభాలు అందుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద క్లిక్కవ్వకపోయినా కూడా ఓటీటీ ద్వారా మంచి ప్రాఫిట్స్ ను అందుకుంటున్నాయి. ఇక ఉప్పెనతో పాటు, జాతిరత్నాలు కూడా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.

ఉప్పెన.. ఎప్పుడంటే?
ఈ ఏడాది లాక్ డౌన్ అనంతరం మొదట్లోనే క్రాక్ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక ఆ తరువాత వచ్చిన ఉప్పెన సినిమా మార్కెట్ స్థాయిని మరో లెవెల్ కు తీసుకెళ్లింది. వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి నటించిన ఈ రోమాంటిక్ లవ్ స్టొరీ బాక్సాఫీస్ వద్ద దాదాపు 55కోట్లకు పైగా లాభాలను అంధించింది. ఇక ఫిబ్రవరి 12 న వచ్చిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

శ్రీకారం కూడా సిద్ధమైంది
శర్వానంద్ శతమానం భవతి స్టైల్ లో మళ్ళీ అదే తరహాలో హిట్ కొట్టాలని శ్రీకారం సినిమాతో కూల్ గా వచ్చాడు. మార్చి 11న ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. అయితే పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికి సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్కవ్వలేదు. దాదాపు 7కోట్ల వరకు నష్టపోవాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా సన్ NXT లో 16వ తేదీ నుంచి సందడి చేయనుంది.

జాతిరత్నాలు కూడా ఫిక్స్
ఇక ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన జాతిరత్నాలు మొదటి రోజు నుంచే హిట్ టాక్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. 12రోజుల పాటి కోటికి తక్కువ కాకుండా షేర్ ను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు 30కోట్లకు ప్రాఫిట్స్ ను అంధించి నటీనటులకు టెక్నీషియన్లకు మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 11నుంచి సందడి చేయనుంది.

చావు కబురు చల్లగా..
టాలెంటెడ్ హీరో కార్తికేయ ప్రయోగాత్మకమైన చిత్రాలను ట్రై చేస్తూ ఓ వర్గం వారిని బాగానే ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఇక చావు కబురు చల్లగా అనే సినిమాను మార్చి 16న రిలీజ్ చేయగా సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద పెద్దగా లాభాలు ఏమి దక్కలేదు. కానీ కార్తికేయ ప్రయత్నానికి మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఇక ఈ సినిమా ఆహా యాప్ లో ఏప్రిల్ 23న విడుదల కానుంది.