దోస్త్ మేరా దోస్త్: ఆ దర్శకులతో జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్.. సెల్ఫీ అదిరింది మామ!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య ఒక సినిమా హిట్టయితే నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా అదే రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్నారు. ముఖ్యంగా దర్శకులకు హీరోలకు సమానంగా క్రేజ్ దక్కడం విశేషం. ఇక జాతిరత్నాలు సినిమాతో నటీనటులు ఏ స్థాయిలో క్లిక్కయ్యారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక దర్శకుడు అనుదీప్ కూడా అదే రేంజ్ లో క్రేజ్ అందుకున్నాడు. అయితే అనుదీప్ ఇటీవల మరో నలుగురు దర్శకులతో దోస్త్ మేరా దోస్త్ అనేలా స్టిల్ ఇచ్చాడు.

అలాంటి ఆలోచన కలిగించిన అనుదీప్
ఇద్దరు హీరోలు కలిసి ఫోటోలకు స్టిల్ ఇస్తే సాధారణంగానే ఆ ఫొటో వైరల్ అవుతుంది. ఇక ఇద్దరు దర్శకులు కలుసుకున్నారు అంటే ఆ ఫొటోలపై అనేక రకాల కామెంట్స్ వస్తుంటాయి. ఇద్దరు దర్శకులు ఏం మాట్లాడుకొని ఉంటారు అనే విషయంపై ప్రేక్షకులు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అలాంటి ఇంటర్వ్యూలకు కూడా భారీ స్థాయిలో వ్యూవ్స్ వస్తుంటాయి. ఇక ఇప్పుడు అనుదీప్ తో పాటు మరో నలుగురు దర్శకులు అదే ఆలోచనను కలిగిస్తున్నారు.

మిలీయన్ల వ్యూవ్స్
జాతిరత్నాలు సినిమాకు ప్రమోషన్ డోస్ పెరగడానికి కారణమైన వారిలో అనుదీప్ కూడా ఉన్నాడు. ఎప్పుడైతే క్యాష్ ప్రోగ్రామ్ లో అతను కనిపించాడో అప్పటి నుంచి సినిమాకు కూడా ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. అతను ఎలాంటి ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా మిలీయన్ల వ్యూవ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి.

దర్శకులంతా ఒక సెల్ఫీలో
అనుదీప్ చాలా కూల్ గా ఉంటూ పంచ్ లు వేసే విధానం జనాలను బాగా ఎట్రాక్ట్ చేసింది. ఇక ఇటీవల నలుగురు దర్శకులతో నాగ్ అశ్విన్ ఇచ్చిన సెల్ఫీ వైరల్ గా మారింది.
సోలో బ్రాతుకే సో బెటర్ దర్శకుడు సుబ్బు, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఫేం శ్రీనివాస్ గవిరెడ్డి, జాతిరత్నలు దర్శకుడు అనుదీప్, సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే దర్శకుడు ఆర్ఎస్ నాయుడు. నాని మజ్ను దర్శకుడు విరించి వర్మ ఈ
సెల్ఫీలో నవ్వుతూ స్టిల్ ఇచ్చారు.
Recommended Video

ఒకరి కష్టం మరొకరికి బాగా తెలుసు.
నేటితరం యువతకు బాగా దగ్గరైన ఈ టాలెంటెడ్ దర్శకులు అంత ఈజీగా ఈ లెవెల్ కు రాలేదు. ఒక్కొక్కరు 7ఏళ్ళ నుంచి 10 ఏళ్ల వరకు స్ట్రగుల్ అయినవారే. ఒకరి కష్టం మరొకరికి బాగా తెలుసు. ఇక అప్పుడప్పుడు సరదాగా కలుసుకుంటూ ఉంటారు. లాక్ డౌన్ లో సినిమాల షూటింగ్స్ లేకపోవడం వలన ఇలా మరోసారి కలుసుకున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











