Don't Miss!
- Sports T20లో డబుల్ సెంచరీ: ఆ భారత ప్లేయర్‌కే సాధ్యం- విలియమ్సన్
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
జాతిరత్నాలు ఓటీటీ రిలీజ్ డేట్.. మరో కొత్త డేట్ ఫిక్స్ అయ్యింది.. ఎప్పుడంటే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత ఒక కామెడీ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన జాతిరత్నాలు సినిమా రోజుకో రికార్డును అందుకుంటోంది. ఇక సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ కూడా లీక్ అయ్యింది. రిలీజ్ డేట్ పై ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు సమాచారం.
హాఫ్ సెంచరీ..
నాగ్ అశ్విన్ నిర్మాతగా స్వప్న సినిమాస్ నిర్మించిన జాతిరత్నాలు సినిమాకు అనుదీప్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి నటన హైలెట్ గా నిలువగా మ్యూజిక్ కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఆఫ్ సెంచరీ కొట్టేసినట్లు తెలుస్తోంది.
యూఎస్ లో కూడా..
మొదటి రోజు నుంచి కూడా సినిమా కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. యూఎస్ లో కూడా మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. పోటీగా మరికొన్ని సినిమాలు వచ్చినప్పటికీ సినిమా ముందు నిలవలేకపోయాయి. అయితే ఓటీటీలో విడుదల ఎప్పుడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజుల్లో చాలా వరకు సినిమాలు థియేటర్స్ లో విడుదలైన కొన్ని రోజులకే డిజిటల్ వరల్డ్ లోకి వచ్చేస్తున్నయి.
ఆ రూమర్స్ అబద్ధం..
సినిమాల రిజల్ట్ ను బట్టి కొన్నిటిని తొందరగా రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని సినిమాలేమో బిజినెస్ పరంగా ఆలస్యంగా వస్తున్నాయి. ఇక జాతిరత్నాలు సినిమాపై ఇటీవల అందుకు సంబంధించిన రూమర్స్ రాగా చిత్ర యూనిట్ ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఈ నెల చివరలోనే సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి రానున్నట్లు కథనాలు రాగా అందులో నిజం లేదని చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది.
అమెజాన్ ప్రైమ్ డేట్ ఫిక్స్..
ఇక ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ వైరల్ గా మారింది. ఆమెజాన్ ప్రైమ్ తో డీల్ సెట్ చేసుకొని వచ్చే నెల రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయినట్లు సమాచారం. ఏప్రిల్ 10 నుంచి సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఆల్ మోస్ట్ ఇదే డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.