రిలీజ్ రోజే ‘జాతి రత్నాలు’ మూవీకి షాక్: అందులో ఫుల్ మూవీ డౌన్‌లోడ్ లింక్.. లీక్ చేసింది వాళ్లే!
చిన్న హీరో సినిమానే అయితేనేం కావాల్సిన దాని కంటే ఎక్కువ పబ్లిసిటీ లభించింది. దీంతో భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే సూపర్ హిట్ టాక్ కూడా వచ్చింది. ఇక, చెప్పేదేముంది.. అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఆ సినిమా ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అదేనండీ.. 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' హీరో నవీన్ పోలిశెట్టి నటించిన 'జాతి రత్నాలు'. గురువారం విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అదే సమయంలో లీకుల రూపంలో భారీ షాక్ తగిలింది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

‘జాతి రత్నాలు’ సినిమా అలా వచ్చింది
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి - ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం 'జాతి రత్నాలు'. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను అనుదీప్ కేవీ అనే దర్శకుడు తెరకెక్కించాడు. 'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ ఈ చిత్రంతో నిర్మాతగా మారాడు. ఎన్నో అంచనాల నడుమ ఇది మహాశివరాత్రి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సరికొత్తగా ప్రమోషన్స్.. భారీ అంచనాలు
కొద్ది రోజులుగా 'జాతి రత్నాలు' మూవీ తెగ హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్‌లో ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తుండడమే. అంతేకాదు, వినూత్నంగా ఆలోచించి చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ కారణంగానే విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగానే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయిందీ మూవీ.

వాటికి తగ్గట్లుగానే థియేట్రికల్ బిజినెస్
నవీన్ పోలిశెట్టి నటించిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అతడి టాలెంట్ గురించి అప్పుడంతా మాట్లాడుకున్నారు. అలాంటి హీరో చేస్తున్న 'జాతి రత్నాలు'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌లతో అవి రెట్టింపు అయిపోయాయి. ఈ కారణంగానే ఈ హాస్య ప్రధానమైన చిత్రానికి రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

గ్రాండ్‌గా.. మొత్తం జాతి రత్నాలు హవా
'జాతి రత్నాలు' సినిమా గురువారం గ్రాండ్‌గా రిలీజ్ అయింది. దాదాపు ఏడు వందలకు పైగా థియేటర్లలో ఇది ప్రదర్శితం అవుతోంది. అది కూడా అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. ప్రీమియర్స్ నుంచే దీనికి మంచి టాక్ రావడంతో స్పందన ఎక్కవ కనిపిస్తోంది. నిన్న మరో మూడు సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ.. 'జాతి రత్నాలు' చిత్రానిదే హవా కనిపిస్తోంది.

జాతి రత్నాలు.. అందరి నోటా అదే మాట
సినిమా చూసిన వాళ్లందరూ 'జాతి రత్నాలు' అద్భుతంగా ఉందని అంటున్నారు. ఇంతటి ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీని ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదని కొనియాడుతున్నారు. మరీ ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ పండించిన కామెడీ పొట్టచెక్కలయ్యేలా నవ్వించిందని చెబుతున్నారు. అలాగే, దర్శకుడు అనుదీప్ ప్రతిభను కూడా ప్రశంసిస్తున్నారు.

రిలీజ్ రోజే ‘జాతి రత్నాలు’ మూవీకి షాక్
'జాతి రత్నాలు' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. ఫలితంగా మీడియం రేంజ్ సినిమాల రికార్డులు బద్దలయ్యేలా కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ రోజే ఈ సినిమాకు భారీ షాక్ తగిలింది. గంటల్లోనే 'జాతి రత్నాలు' మూవీ పైరసీ వీడియో బయటకు వచ్చేసింది. దీంతో కలెక్షన్లపై ప్రభావం పడే ప్రమాదం ఏర్పడింది.

అందులో ఫుల్ మూవీ డౌన్‌లోడ్ లింక్
పైరసీని ప్రోత్సహించే కొన్ని వెబ్‌సైట్లు 'జాతి రత్నాలు' సినిమా ఫుల్ మూవీ డౌన్‌లోడ్ లింక్‌ను గురువారమే పెట్టేశాయి. ఇది పైరసీ మాఫియాకు పెద్దన్నలా వ్యవహరిస్తున్న తమిళ్ రాకర్స్ చేసిన పనే అని తెలుస్తోంది. అందుకే ఆ సైట్‌తో పాటు మరికొన్నింటిలో ఈ మూవీ దర్శనమిచ్చింది. దీంతో థియేటర్లకు వెళ్లి చూడలేని చాలా మంది ఈ సైట్లను ఆశ్రయించే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications











