Just In
- 4 hrs ago
బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
- 4 hrs ago
Vakeel Saab Day 5 collections.. చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్.. లాక్డౌన్ తర్వాత అరుదైన రికార్డు
- 5 hrs ago
ఏక్ లవ్ యా అంటూ నిర్మాతగా మారిన పూరీ జగన్నాథ్ హీరోయిన్.. సొంత తమ్ముడే హీరోగా
- 5 hrs ago
ఐదు భాషల్లో ఆర్జీవి ‘దెయ్యం’.. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు.. రిలీజ్ ఎందుకు లేట్ అయిందంటే..
Don't Miss!
- News
గూర్ఖాలూ ఆందోళన వద్దు! మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అమిత్ షా
- Sports
KKR vs MI:గెలిచే మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా.. ముంబై ఇండియన్స్ బోణీ!
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్లు జంప్, మార్కెట్ అదరగొట్టడం వెనుక...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Lifestyle
Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జాతిరత్నాలు ఓటీటీ ఆఫర్.. మైండ్ బ్లోయింగ్.. అన్ని కోట్లు ఇస్తామన్నా తగ్గలేదు
మీడియం రేంజ్ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ జాతిరత్నాలు సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా కలెక్షన్స్ రెండు వారాల వరకు ఒకే రకమైన ఫ్లోలో వెళ్లాయి. ఈ సినిమా విజయం వెనుక ఒక బలమైన ఓపిక కూడా ఉందనే చెప్పాలి. అసలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల కావాల్సిందట. రెండు ఓటీటీ సంస్థలు టెంప్ట్ అయ్యే రేంజ్ లోనే ఆఫర్ ప్రకటించినట్లు తెలిసింది. ఇక హిట్టయిన అనంతరం కూడా మంచి ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది.

ఇలా అవుతుందని అనుకోలేదు
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో జాతిరత్నాలు నిలిచింది. క్రాక్, ఉప్పెన సినిమాల కంటే తక్కువ బడ్జెట్ లో రూపొందించిన ఈ సినిమా ఒక విధంగా ఆ సినిమాల కంటే అత్యదిక లాభాలను అందించాయని చెప్పవచ్చు. సినిమా హిట్టవుతుందని అనుకున్నారు గాని మరీ ఈ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు ఊహించలేదు.

ప్రాఫిట్స్ ఎంతంటే..
సినిమా కలెక్షన్స్ సినీ వర్గాలను షాక్ అయ్యేలా చేశాయి. కేవలం 11.5కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చిన ఈ సినిమా 16రోజుల్లో 36.64కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే 25కోట్ల వరకు ప్రాఫిట్స్ ను అందించి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇక అమెరికాలో లాక్ డౌన్ అనంతరం 1 మిలియన్ డాలర్లను అందుకున్న మొదటి ఇండియన్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
కొంటె చూపుతో కాకపుట్టిస్తోంది.. మధురిమ ఫోటోలు వైరల్

అప్సెట్ అయ్యారు..
జాతిరత్నాలు సినిమా గత ఏడాది సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని అంతా సిద్ధం చేసుకున్నారు. ప్రమోషన్ డోస్ పెంచే క్రమంలో ఒక్కసారిగా లాక్ డౌన్ పడడంతో చిత్ర యూనిట్ సభ్యులంతా అప్సెట్ అయ్యారు. ఆ సమయంలో ఓటీటీ ఆఫర్ కు కొంత లాభం వచ్చినా సినిమాలను రిలీజ్ చేయాలని చాలా మంది చర్చలు జరిపారు. ఇక జాతిరత్నాలు సినిమాకు కూడా ఆఫర్స్ బాగానే వచ్చాయి.
క్లీవేజ్ షోతో హల్చల్.. నిక్కీ తంబోలి రచ్చ

భారీ ఆఫర్స్ వచ్చినా..
నెట్ ఫ్లిక్స్ తో పాటు ఆమెజాన్ ప్రైమ్ సినిమా ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేసుకునే కొన్ని ఆఫర్స్ ఇచ్చాయి. ఆ రేటుకు ఎవరైనా సరే టెంప్ట్ అవ్వాల్సిందే. సినిమాపై 8కోట్ల కంటే తక్కువ పెట్టుబడి పెట్టారు. ఇక ఆమెజాన్ ప్రైమ్ డైరెక్ట్ రిలీజ్ కోసం మొత్తంగా 18కోట్ల ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ నిర్మాత నాగ్ అశ్విన్ ఒప్పుకోలేదు.
బికినీ అందాలు.. ఔరా అనిపిస్తోన్న నైరా బెనర్జీ

ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
సినిమా మీద నమ్మకంతో చాలా రోజులు వెయిట్ చేశారు. ఇక మధ్యమధ్యలో నెట్ ఫ్లిక్స్ నుంచి మరికొన్ని టెంప్టింగ్ ఆఫర్స్ వచ్చినా తగ్గలేదట. ఇక వారి ఓపికకు నమ్మకానికి తగ్గట్లుగానే జాతిరత్నాలు బాక్సాఫీస్ వద్ద మూడింతల లాభాలను అందించింది. ఇక అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 10 నుంచి సినిమా సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.