జాతి రత్నాలు మూవీ ట్విట్టర్ రివ్యూ: అందరి నోటా అదే మాట.. ఫస్టాఫ్ అలా.. సెకెండాఫ్ ఇలా.. హైలైట్ ఇదే!

పెద్ద పెద్ద స్టార్లు నటించే సినిమాలకు మాత్రమే ఒకప్పుడు విపరీతమైన హైప్ ఉండేది. కానీ, ఈ మధ్య కాలంలో చిన్న హీరోలు చేసే చిత్రాలు కూడా భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంటున్నాయి. అలాంటి వాటిలో నవీన్ పోలిశెట్టి నటిస్తోన్న 'జాతి రత్నాలు' ఒకటి. ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీగా రూపొందిన ఈ మూవీ మహా శివరాత్రి సందర్భంగా గురువారం విడుదల అవుతుంది. అయితే, ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్స్ పడిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా అభిప్రాయం చెబుతున్నారు. అసలు ఈ మూవీ ఎలా ఉందంటే?

జాతి రత్నాలు... వాళ్లందరూ కలిసి ఇలా

జాతి రత్నాలు... వాళ్లందరూ కలిసి ఇలా

'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'తో భారీ హిట్ కొట్టిన నవీన్ పోలిశెట్టి - ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా వస్తున్న చిత్రం 'జాతి రత్నాలు'. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అనుదీప్ కేవీ తెరకెక్కించాడు. ద‌ర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రంతో నిర్మాతగా మారాడు. ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది.

అదిరిపోయే ప్రమోషన్.. భారీ అంచనాలు

అదిరిపోయే ప్రమోషన్.. భారీ అంచనాలు

'జాతి రత్నాలు' మూవీ కొద్ది రోజులుగా అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ తెగ హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్‌లో ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తుండడమే. అంతేకాదు, వినూత్నంగా ఆలోచించి చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ కారణంగానే విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

షాక్ ఇస్తోన్న జాతి రత్నాలు ప్రీ బిజినెస్

షాక్ ఇస్తోన్న జాతి రత్నాలు ప్రీ బిజినెస్

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ కమెడియన్లు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శితో కలిసి హీరో నవీన్ పోలిశెట్టి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై బజ్‌ను విపరీతంగా పెంచేశాయి. దీంతో చిన్న సినిమానే అయినా.. మీడియం రేంజ్ హీరోలతో సమానంగా దాదాపు రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

అక్కడ గ్రాండ్‌గా.. జాతి రత్నాలుదే హవా

అక్కడ గ్రాండ్‌గా.. జాతి రత్నాలుదే హవా

'జాతి రత్నాలు' సినిమా అమెరికాలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఆ దేశంలో ఏకంగా 45 లొకేషన్లలో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. తెలుగులో బడా స్టార్లకు సమానంగా అన్ని చోట్ల ప్రదర్శితం అవుతుండడం విశేషం. ఈరోజు మరో మూడు సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ.. 'జాతి రత్నాలు' చిత్రానిదే హవా కనిపిస్తోంది. దీంతో అక్కడ భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

జాతి రత్నాలు.. అందరి నోటా అదే మాట

జాతి రత్నాలు.. అందరి నోటా అదే మాట

అమెరికాలో ప్రీమియర్ షోలు చూసిన వాళ్లందరూ 'జాతి రత్నాలు' అద్భుతంగా ఉందని అంటున్నారు. ఇంతటి ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీని ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదని కొనియాడుతున్నారు. మరీ ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ పండించిన కామెడీ పొట్టచెక్కలయ్యేలా నవ్వించిందని చెబుతున్నారు. మొత్తంగా దీనికి పాజిటివ్ టాక్ వస్తోంది.

ఫస్టాఫ్ అలా.. సెకెండాఫ్ ఇలా.. ఎలా ఉంది?

ఫస్టాఫ్ అలా.. సెకెండాఫ్ ఇలా.. ఎలా ఉంది?

ఉద్యోగం కోసం సిటీకి వచ్చే ముగ్గురు కుర్రాళ్ల జీవితంలో జరిగిన ఊహించని సంఘటనలను ఫన్నీగా చూపిస్తూ తీసిన చిత్రమే 'జాతి రత్నాలు'. ఫస్టాఫ్ మొత్తం ఎంతో సరదాగా సాగిపోతుందని సినిమాను చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. టాలీవుడ్‌లో ఇప్పటి వరకూ రాని విధంగా ఉందని అంటున్నారు. సెకెండాఫ్ మాత్రం పర్వాలేదనిపించదట. మొత్తంగా చూడదగ్గ సినిమా అని టాక్.

ఎవరు ఎలా చేశారు? సినిమాలో హైలైట్లు

ఎవరు ఎలా చేశారు? సినిమాలో హైలైట్లు

కామెడీ ప్రధానంగా సాగిన 'జాతి రత్నాలు'లో నవీన్ పోలిశెట్టి అదరగొట్టేశాడట. అతడికి ప్రియదర్శి, రాహుల్ చక్కని తోడ్పాటును అందించారట. ఇక, హీరోయిన్ పాత్ర తక్కువే అయినా ఆకట్టుకుందని టాక్. ఇక, చిన్న పాయింట్‌తోనే తీసినా ఫన్నీగా చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడని అంటున్నారు. ఇక, ఇందులో చిన్న చిన్న పంచ్ డైలాగులే హైలైట్ అయ్యాయట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X