చిరు, రవితేజకు ప్లాపులు రాలేదా? సాయి ధరమ్ తేజ్ అంతే... పవన్ గ్రేట్ : బివిఎస్ రవి

By Bojja Kumar

Recommended Video

చిరు, రవితేజకు ప్లాపులు రాలేదా? సాయి ధరమ్ తేజ్ అంతే...!

మాటల రచయితగా, స్క్రీన్ రైటర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బివిఎస్ రవి దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన 'జవాన్' మూవీ డిసెంబర్ 1న విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో 'జవాన్' సినిమా గురించిన విశేషాలు వెల్లడించడంతో పాటు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.

 నా ఇంట్లో దీపం పెట్టినంత ఆనందం వేసింది

నా ఇంట్లో దీపం పెట్టినంత ఆనందం వేసింది

సాయి ధరమ్ తేజ్‌తో సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. తిక్క, విన్నర్, నక్షత్రం సమయంలో సాయి ధరమ్ తేజ్ ను కలిశాను. సుప్రీమ్ సినిమా చేస్తున్నపుడు ‘జవాన్' కథ చెప్పాను. నక్షత్రం సినిమా లేటు కావడంతో మా సినిమా కాస్త ఆలస్యం అయింది. నక్షత్రం తర్వాత నాతో సినిమా చేస్తానని సాయి ధరమ్ తేజ్ చెప్పడంతో నా ఇంట్లో ఆయన దీపం పెట్టినంత ఆనందం వేసింది అని బివిఎస్ రవి తెలిపారు.

 చిరు, రవితేజ ప్లాపుల తర్వాత హిట్లు కొట్టారు

చిరు, రవితేజ ప్లాపుల తర్వాత హిట్లు కొట్టారు

సాయి ధరమ్ తేజ్‌కు ఈ మధ్య వరుస ప్లాపులు ఎదురయ్యాయి కదా జవాన్ సినిమాపై ఆ ప్రభావం ఉంటుందా? అనే ప్రశ్నకు బివిఎస్ రవి స్పందిస్తూ... "చిరంజీవిగారికి హిట్స్ తరువాత 'రాజా విక్రమార్క', 'స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్'లతో ప్లాపులు ఎదురయ్యాయి. తర్వాత 'గ్యాంగ్ లీడర్', 'రౌడీ అల్లుడు', 'ఘరానా మొగుడు'తో బ్లాక్ బస్టర్స్ కొట్టారు. రవితేజ, నాని లాంటి వారు కూడా ప్లాపుల తర్వాత హిట్స్ కొట్టారు అని బివిఎస్ రవి గుర్తు చేశారు.

 అలా అని హీరోను వదిలేయడం జరగదు

అలా అని హీరోను వదిలేయడం జరగదు

"ఒక హీరోను ప్రేక్షకులు అభిమానించడం మొదలుపెట్టిన తరువాత, పరాజయాలు వచ్చాయి కదా అని వెంటనే ఆ హీరోను వదిలేయడం జరగదు. సాయి ధరమ్ తేజ్ విషయంలోనూ అంతే, ఆయనకు అభిమానుల సపోర్టు ఉంది అని బివిఎస్ రవి తెలిపారు.

 హిట్స్ కొడతాడనే నమ్మకం ఉంది

హిట్స్ కొడతాడనే నమ్మకం ఉంది

సాయి ధరమ్ తేజ్‌కు రెండు ప్లాప్‌లు ఇచ్చినా ‘జవాన్' మూవీతో హిట్ కొడతాడనే నమ్మకం నాకముంది. ఈ సినిమాలో అతడి పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటుంది అని బివిఎస్ రవి తెలిపారు.

 పవన్ కళ్యాణ్ గురించి

పవన్ కళ్యాణ్ గురించి

పవన్ కళ్యాణ్ ప్రస్తావన రాగానే బివిఎస్ రవి స్పందిస్తూ...ఒక నిలకడ. ఒక నిజాయితీ మనిషి. శిఖరాగ్రమైన వ్యక్తిత్వం. అందరితోనూ చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. వీడు ఇలాంటివాడు .. వాడు అలాంటివాడు అని మాట్లాడే మనస్తత్వం కాదు. తన వ్యక్తిత్వాన్ని తాను కాపాడుకుంటూ తనదైన మార్గంలో నడుస్తూ, వివిధ రకాల వ్యక్తిత్వాలు గల వ్యక్తులకు విలువనిస్తూ ముందుకెళ్లే సంస్కారం, గొప్ప లీడర్స్ కి ఆభరణం. అలాంటివాళ్లు లీడర్స్ కావాలి" అని బివిఎస్ రవి వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X