Jawan Trailer review నా కొడుకుపై కాదు వాడి బాబుపై చేయి వేసి చూడు.. షారుక్‌కు ఫ్యాన్స్ కావాల్సిందే..

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, సౌత్ సూపర్ స్టార్ నయనతార నటించిన జవాన్ మూవీ రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో ఆడియో రిలీజ్‌ను బ్రహ్మండంగా నిర్వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్ కార్యక్రమాన్ని దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విడుదల చేసిన జవాన్ ట్రైలర్‌‌పై ఓ లుక్ వేయండి..

అనగనగా ఓ రాజు.. ఒకదాని తర్వాత మరొక యుద్దం ఓడిపోతూనే ఉన్నాడు అంటూ ట్రైలర్‌ను ప్రారంభించారు. ఓటమితో ఆ రాజు చాలా కోపంగా ఉన్నాడు అంటూ ఎమోషనల్‌గా ట్రైలర్‌లో కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ముంబైలో హైజాక్ ఘటన దేశం మొత్తం సంచలనం రేపింది.. అంటూ కథను సీరియస్‌గా మార్చేశాడు.

నీకు ఏం కావాలో చెప్పు అంటే.. ఆలియా భట్ కావాలి అంటూ షారుక్ అనడం, గోనే సంచిని హెల్మెట్‌లా పెట్టుకొన్నాడు.. అంటే.. అందరూ అతడికి ఫ్యాన్స్ కావాల్సిందే డైలాగ్స్ ఫన్నీగా, క్రేజీగా ఉన్నాయి.
మన దగ్గర ఒకటే ఒకటి ఉంది.. ఆరుగురు అమ్మాయిలు.. అని ప్రియమణి హింట్ ఇస్తే.. ఓడిపోతావు అని దీపిక పదుకోన్ అంటే.. .. నిన్ను చూసినప్పుడే ఓడిపోయాను.. అంటూ షారుక్‌తో మంచి యాక్షన్ ఎపిసోడ్‌తో అభిమానుల్లో అంచనాలు పెంచారు.

Jawan movie Trailer review: Shah Rukh Khan style and action enthrals audience

ఇక విజయ్ సేతుపతి ఎంట్రీ అదిరిపోయేలా ట్రైలర్‌లో ఇచ్చారు. నేను విలనై నీ ముందుకు వచ్చాను.. షారుక్ అని అంటే.. విలన్.. మై నేజ్ ఈజ్ కాళీ..నా ప్రాణం కంటే ఎక్కువగా నిర్మించుకొన్న సామ్రాజ్యం మీద చేయి వేస్తే..అంటూ విజయ్ సేతుపతి తన మార్కు విలనిజాన్ని చూపించాడు.

Jawan movie Trailer review: Shah Rukh Khan style and action enthrals audience

మేము జవాన్లం.. మా ప్రాణాలను ఒక్కసారి కాదు.. వేయిసార్లైన త్యాగం చేస్తాం దేశం కోసం.. కానీ మీలాంటి వాళ్లు తమ లాభాల కోసం ఆశిస్తే.. మా ప్రాణాలను త్యాగం చేయం.. అంటూ షారుక్ చెప్పిన డైలాగ్స్ షారుక్ క్యారెక్టర్‌లోని హీరోయిజాన్ని, ఎమోషన్స్ చూపించాయి. నా కోడుకు మీద చేయి వేసే ముందు.. వాడి బాబు మీద చేయివేయి.. సవాల్ విసరడం సినిమా ఎలా ఉండబోతుందో రుచి చూపించాడు.

Jawan movie Trailer review: Shah Rukh Khan style and action enthrals audience

షారుక్‌ను నీ జుట్టు నిజమేనా.. రంగు వేసుకొన్నావా? అంటూ ఓ పిల్లాడు షారుక్ ప్రశ్నించడం ఫ్యామిలీ ఎలిమెంట్స్ చూపించాయి. ఇంకే కావాలి అని నయనతార అంటే.. ఒక పాట పాడు అంటూ షారుక్ ఖాన్, నయనతార మధ్య రొమాంటిక్ సీన్లు ఫ్యాన్స్‌ను ఫిదా చేసేలా ఉన్నాయి. మొత్తానికి జవాన్ మూవీ ఫ్యాన్స్ పంచభక్ష పరమాన్నంలా ఉండబోతుందని చెప్పకనే చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X