Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బోయపాటి స్టైల్: "జయ జానకి నాయక" ట్రైలర్
"జయ జానకి నాయక" ట్రైలర్ రిలీజైంది. బోయపాటి దర్శకత్వంలో ఈచిత్రం తెరకెక్కుతోంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం జయజానకినాయక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే మేకింగ్ విషయంలో బోయపాటి ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. తన మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఎలివేట్ చేస్తూ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కించారు.
ఆడియో రిలీజ్ కార్యక్రమంలో వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను, జగపతిబాబు, మిర్యాల రవీందర్ రెడ్డి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, శరత్‌కుమార్, వాణీ విశ్వనాథ్, రైటర్ రత్నం, సినిమాటోగ్రాపర్ రిషి పంజాబీ, దేవిశ్రీప్రసాద్, సాహిసురేష్, ప్రేమ్ రక్షిత్, కోటగిరి వెంకటేశ్వరరావు, తరుణ్ అరోరా తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, కళ: సాహి సురేష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, స్టిల్స్: జీవన్, పోస్టర్ డిజైన్స్: ధని ఏలె, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్, పోరాటాలు: రామ్ లక్ష్మణ్, నిర్మాణం: ద్వారకా క్రియేషన్స్, నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను!