For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jaya Krishna: కృష్ణ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మహేశ్ ఫ్యామిలీ నుంచి హీరో.. ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడో!

  |

  టాలీవుడ్‌లోకి ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది స్టార్లు తమ పిల్లలను చిత్రసీమకు పరిచయం చేశారు. అందులో కొందరు గ్రాండ్ ఎంట్రీలను సొంతం చేసుకోవడంతో పాటు ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగిపోయారు. దీంతో మరికొందరు సినీ ప్రముఖులు తమ వారసులను పరిచయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, ఆ కుర్రాడిని బాధ్యతలను మహేశ్ బాబే దగ్గరుండి చూసుకుంటున్నట్లు కూడా తెలిసింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

  కృష్ణ వారసులుగా ఇద్దరు హీరోలు

  కృష్ణ వారసులుగా ఇద్దరు హీరోలు


  సుదీర్ఘ కాలం పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని సూపర్ స్టార్‌గా వెలుగొందారు కృష్ణ. ఆయన తర్వాత తన వారసులుగా రమేష్ బాబు, మహేశ్ బాబును హీరోలుగా పరిచయం చేశారు. అలాగే, ఆయన కుమార్తె మంజుల కూడా కొన్ని చిత్రాల్లో కనిపించారు. కానీ, అందులో మహేశ్ ఒక్కడే టాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతోన్నాడు.

  Gaalodu Twitter Review: గాలోడుకు అలాంటి టాక్.. ప్లస్ మైనస్‌లు ఇవే.. ఇంతకీ సుధీర్ హిట్ కొట్టాడా అంటే!

  వాళ్లు కూడా ఎంట్రీ.. ఓ రేంజ్‌లో

  వాళ్లు కూడా ఎంట్రీ.. ఓ రేంజ్‌లో


  సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి కొడుకులు, కుమార్తెలే కాదు.. మరికొందరు కూడా సినిమాల్లో సందడి చేస్తోన్నారు. అందులో చిన్న అల్లుడు సుధీర్ బాబు టాలీవుడ్‌లో హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్నాడు. అలాగే, మంజుల భర్త సంజయ్ స్వరూప్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అదరగొడుతోన్నారు. ఇలా కృష్ణ ఫ్యామిలీ సభ్యులు సినిమాల్లో సందడి చేస్తోన్నారు.

  కృష్ణ మనవడు కూడా పరిచయం

  కృష్ణ మనవడు కూడా పరిచయం


  సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కూతురు గల్లా పద్మావతి కుమారుడు గల్లా అశోక్ 'హీరో' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ ఆశించిన రీతిలో ఆడలేదు. దీంతో అశోక్‌కు సరైన ఆరంభం మాత్రం దగ్గలేదు. అయినప్పటికీ అతడు మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

  ఏకంగా షర్ట్ విప్పేసిన యాంకర్ స్రవంతి: ఎద అందాలు ఆరబోస్తూ ఘోరంగా!

  కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో

  కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో

  ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతో మంది వారసులు సినీ రంగానికి పరిచయం అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ కుటుంబం నుంచి మరో హీరో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. అతడు ఎవరో కాదు.. రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ. అవును.. అతడు త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. దీంతో ఇప్పుడీ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

  ఫారెన్‌లో శిక్షణ.. మహేశ్ బాధ్యత

  ఫారెన్‌లో శిక్షణ.. మహేశ్ బాధ్యత


  రమేష్ బాబు మరణం తర్వాత ఆయన పిల్లలు జయకృష్ణ, భారతి బాధ్యతలను సూపర్ స్టార్ మహేశ్ బాబు తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే వాళ్ల ఇంట్రెస్ట్ మేరకు భారతిని చదివిస్తుండగా.. జయకృష్ణకు ఫారెన్‌లో యాక్టింగ్, మార్షల్ ఆర్ట్స్, డ్యాన్స్ తదితర విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాడట. అవి పూర్తైన వెంటనే మహేశ్ స్వయంగా అతడిని పరిచయం చేస్తాడట.

  రష్మీ గౌతమ్‌కు విల్లాను గిఫ్టుగా ఇచ్చిన హీరో: అతడి గురించి పెదవి విప్పబోతున్న యాంకర్

  తాతను చూడలేక భావోద్వేగంతో

  తాతను చూడలేక భావోద్వేగంతో


  టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గత మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనను కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఘట్టమనేని జయకృష్ణ మాత్రం సరైన టైంకు రాలేకపోయాడు. దీంతో అంత్యక్రియల తర్వాత తన తాత చిత్ర పటాన్ని చూసి ఎంతో భావోద్వేగానికి గురయ్యాడని తెలుస్తోంది.

  బాబాయితో జయకృష్ణ పిక్ వైరల్

  బాబాయితో జయకృష్ణ పిక్ వైరల్


  సూపర్ స్టార్ కృష్ణ చిన్న కర్మను గురువారం రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయకృష్ణ హైలైట్ అయ్యాడు. ముఖ్యంగా బాబాయి మహేశ్ బాబుతో అతడు దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇందులో జయకృష్ణ ఎంతో హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. అదే సమయంలో అతడు హీరోగా వస్తున్నాడని తెలిసింది. దీంతో కృష్ణ ఫ్యాన్స్ అందరికి కాస్త ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు.

  English summary
  Tollywood Senior Hero Krishna Died Tuesday. Now His Grand Son Jaya Krishna Ghattamaneni Hero Debut News Goes Hot Topic in Film Industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X