»   » జయప్రద ఇకపై ‘నవరస కళాభినేత్రి’ (ఫోటోస్)

జయప్రద ఇకపై ‘నవరస కళాభినేత్రి’ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

విశాఖ: ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు టీఎస్ఆర్ లలితా కళాపరిషత్ ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. జయప్రద తన సినీ కెరీర్లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెకు ‘నవరస కళాభినేత్రి' అనే బిరుదు ప్రధానం చేసారు. టిఎస్ఆర్ లలిత కళాపరిషత్ ఫౌండర్, చైర్మ టి.సుబ్బిరామిరెడ్డి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు.

విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో జయప్రదకు కంకణం తొడిగి, ‘నవరస కళాభినేత్రి' బిరుదు ప్రదానం చేశారు. తనకు వేదికపై మాట్లాడడం నేర్పింది, ఇతర భాషల్లో నటిగా పరిచయం చేసింది సుబ్బిరామిరెడ్డి అని జయప్రద అన్నారు. ఈ బిరుదును మరెక్కడో అందుకుంటే ఇంత ఆనందం ఉండేదికాదని, పుట్టినిల్లు లాంటి విశాఖలో అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ, విశాఖ ప్రజలంతా తన కుటుంబసభ్యులతో సమానమని, అందుకే ఏటా జన్మదిన వేడుకలను ఇక్కడ జరుపుకుంటున్నానని చెప్పారు.

సుబ్బిరామిరెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పలువు సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. స్లైడ్ షోలో వారికి సంబంధించిన ఫోటోలు....

జయప్రద
  

జయప్రద

జయప్రదకు కంకణం తొడిగి, ‘నవరస కళాభినేత్రి' బిరుదు ప్రదానం చేస్తున్న దృశ్యం.

సినీ హీరోయిన్లు
  

సినీ హీరోయిన్లు

జయప్రదకు బిరుదు ప్రధానోత్సవ కార్యక్రమంలో పల్గొన్న సినీ హీరోయిన్లు.

పొలిటీషియన్స్
  

పొలిటీషియన్స్

జయప్రదకు బిరుదు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పొలిటీషియన్స్

శివ భక్తుడు
  

శివ భక్తుడు

సుబ్బిరామిరెడ్డి శివ భక్తుడు అనే విషయం తెలిసిందే.

రాజకీయ నాయకులు
  

రాజకీయ నాయకులు

ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

 

 

Please Wait while comments are loading...