జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ లతో కొత్త అనుభూతి: జయప్రద
జూ ఎన్టీఆర్, రాంచరణ్ వంటి యూత్ స్టార్స్‌తో ఈ ప్రోగ్రామ్ చెయ్యడం కొత్త అనుభూతినిస్తోంది అంటోంది జయప్రధ. లోకల్ చానల్‌లో తను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'జయప్రదం' టీవీ షో బుధవారం ప్రారంభమవుతున్న సందర్భంగా ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె మాటల్లోనే...అశ్వనీదత్ నిర్మించిన ఎన్నో సినిమాల్లో నాకు మంచి మంచి అవకాశాలిచ్చారు. నా కెరీర్‌లో గొప్ప గొప్ప పాత్రలిచ్చిన కె. విశ్వనాథ్, దాసరి నారాయణరావు వంటి దర్శకుల్ని ఈ కార్యక్రమం ద్వారా ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది అని ఆమె అన్నారు. అలాగే తనకు సినిమాల్లో మళ్ళీ నటించాలని ఉందంటూ...అక్క, అమ్మ, ఆంటీ పాత్రలు చెయ్యడానికి నాకేం అభ్యంతరం లేదు. అప్పట్లోనే నా కెరీర్ మంచి స్థితిలో ఉన్నప్పుడే 'సాగర సంగమం'లో తల్లిగా, అమ్మమ్మగా నటించా. క్యారెక్టరే నాకు ముఖ్యం. అలా అని చిన్న చిన్న పాత్రలు, ప్రాధాన్యత లేని పాత్రలు చెయ్యాల్సిన అవసరం నాకు లేదు అంటోంది ఆమె.
నాకోసం స్క్రిప్టులు రాసే రోజులొస్తాయనుకుంటున్నా. బహుశా అశ్వనీదత్ ప్రొడక్షన్ నుంచే అలాంటి సినిమా రావచ్చేమో అంటూ ఆశాభావం వ్యక్తం చేసారు జయప్రధ. ఇక ఇప్పటివరకు ఎనిమిది భాషల్లో మూడొందల పైగా చిత్రాల్లో నటించా.'సాగర సంగమం'లో చేసినటువంటి పాత్ర మళ్లీ చెయ్యాలని ఉంది. కథకి కీలకమైన పాత్రలు చెయ్యాలనుకుంటున్నా. నేను డైరెక్టర్ ఆర్టిస్టుని. డైరెక్టర్ ఏది చెబితే అదే చేస్తా. నాకు డబ్బు ప్రధానం కాదు. ఎక్కడ ప్రేమ, అభిమానం ఉంటే అక్కడ పనిచేస్తా. ఒక స్థాయికి వెళ్లాక డబ్బుకోసం పనిచెయ్యాలని అనిపించదు. లోకల్ టీవీ కోసం 'జయప్రదం' ప్రోగ్రామ్‌ని చెయ్యడానికి కారణం ఆ ప్రేమాభిమానాలే అని చెప్పారామె. ఇక ప్రస్తుతం ఆమె బాలకృష్ణ,దాసరి కాంబినేషన్లో రెడీ కానున్న పరమ వీర చక్ర చిత్రంలో ఓ కీలకమైన పాత్రకు కమిట్ అయినట్లు సమాచారం.ఇంతకుముందు కూడా ఆమె బాలకృష్ణ అత్తగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన మహారధి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











