జయ ప్రకాష్ రెడ్డి మరణం.. పరిశ్రమకు తీరని లోటు. .. బాలయ్య, మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ ఎమోషనల్
టాలీవుడ్ విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి మరణ వార్త సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. నేడు (సెప్టెంబర్ 8) తెల్లవారుఝామున గుండెపోటుతో మరణించారన్న వార్త తెలిశాక.. సినీ ప్రముఖులంతా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. జేపీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఇప్పటికే ఎన్టీఆర్, అనిల్ రావిపూడి వంటి వారు ఎమోషనల్ కాగా.. నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు, ప్రకాష్ రాజ్, రామ్, జెనీలియా ఎంతో మంది స్పందించారు.

ప్రకాష్ రాజ్ ఎమోషనల్..
సహచర నటుడు జయప్రకాష్ రెడ్డి గారు హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నటనంటే ఆయనకు ప్రాణం. అటు వెండితెరపైన, ఇటు స్టేజ్ నాటకాలలోను పోషించిన పాత్రలకు ప్రాణం పోసిన నటుడాయన. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నాను. మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్స్.. ఆత్మకు శాంతి కలగాలి అని ప్రకాష్ రాజ్ ఎమోషనల్ అయ్యాడు.

ప్రతీ క్షణం, ప్రతీ మూమెంట్..
జయప్రకాష్ రెడ్డి మరణ వార్త విని ఎంతో కలత చెందాను. ఇండస్ట్రీలో ఓ గొప్ప నటుడు, కమెడియన్. ఆయనతో కలిసి చేసిన ప్రతీ క్షణం, ప్రతీ మూమెంట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబానికి, ఆయన్ను అభిమానించే వారందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని మహేష్ బాబు ట్వీట్ చేశాడు.

రామ్, జెనీలియా ట్వీట్..
డియర్ జయప్రకాష్ రెడ్డి గారు.. మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్స్.. రెడీ సినిమా సెట్‌లో మిమ్మల్ని మొదటి సారి చూసినప్పటి నుంచి ఓ గ్రేట్ ఫీలింగ్ కలిగింది..మీ ఆత్మకు శాంతి చేకూరాలి సర్ అంటూ రామ్ ఎమోషనల్ అయ్యాడు. జయ ప్రకాష్ రెడ్డి ఆత్మకు శఆంతి చేకూరాలి.. షూటింగ్ సమయాల్లో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటుంటే ఎంతో బాగుంది సర్.. మీతో మాట్లాడిన ప్రతీసారి ఎంతో సరదాగా ఉంటుంది అంటూ జెనీలియా ఎమోషనల్ అయింది.
Recommended Video

తీరని లోటు..
ఎన్నో మంచి పాత్రలతో మెప్పించిన విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి గారి మృతి విచారకరం, పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. అని నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











