twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జయప్రకాశ్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు.. గుంటూరులో అంత్యక్రియలు పూర్తి

    |

    ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఆకస్మిక మరణం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆయన మరణాన్ని పలువురు మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోయారు. అలాంటి గొప్ప నటుడి అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుంటూరులో ముగిసాయి. అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు, కళాకారులు ఆయనకు కడసారి కన్నీటి వీడ్కోలు తెలిపారు. కుటుంబ సభ్యులు అశ్రనయనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు.

    కరోనావైరస్ పాజిటివ్‌తో బాధపడుతున్న జయప్రకాశ్ రెడ్డి అంత్యక్రియలకు దూరంగా ఉన్నారు. తండ్రి చితిని దూరంగా చూస్తూ ఆయన ఆత్మశాంతికి ప్రార్థించారు. సినిమా పరిశ్రమ నుంచి రచ్చ రవి, గిరి తదితరులు హాజరయ్యారు.

    Jaya Prakash Reddy last rites finished in guntur

    జయప్రకాశ్ రెడ్డి సోమవారం రాత్రి ఆక్సిజన్ అందక శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడటంతో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆయన పరిస్థితి మెరుగుపడటంతో మళ్లీ ఇంటికి తీసుకెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో ఆయన బాత్రూంకు వెళ్లి అక్కడే కుప్పకూలడంతో హాస్పిటల్‌ తరలించారు. అప్పటికీ ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించడంతో పెను విషాదం నెలకొన్నది.

    నాటక రంగంతో విడదీయలేని అనుబంధాన్ని పెంచుకొన్న జయప్రకాశ్ రెడ్డి సినీ నటుడిగా ప్రేమించుకొందాం రా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సినీ రంగానికి వచ్చి వందలాది చిత్రాల్లో నటించారు. కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్నారు. రాయలసీమ మాండలికంలో ఆయన చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

    English summary
    Senior Character artist, Comedian Shri. Jaya Prakash reddy passed away today early morning due to cardiac arrest. Such a huge loss to telugu cinema, Rest in peace sir Jayaprakashreddy. Apart from His last rites finished in guntur.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X