తెలుసా? జయ ప్రకాశ్‌రెడ్డి పాట పాడారు

By Srikanya

హైదరాబాద్‌: తన నటనతో ప్రేక్షకులను అలరించే జయ ప్రకాశ్‌రెడ్డి తొలిసారి 'లచ్చిందేవికి ఓలెక్కుంది' చిత్రం కోసం ఓ పాట పాడారు. ఈ విషయాన్ని చిత్ర హీరో నవీన్‌చంద్ర తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలుపుతూ... ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు.

#LOL Coming Soon

Posted by Naveen Chandra on 1 December 2015

నవీన్‌ చంద్ర, లావణ్య త్రిపాఠిలు జంటగా నటిస్తున్న చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'. ‘లోల్' అన్న టైటిల్‌తో ప్రచారం పొందుతోన్న ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో లోల్ టీమ్ డిసెంబర్ 11న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని రిలీజ్‌కి సిద్ధమైంది. జగదీశ్‌ తలసిల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయిప్రసాద్‌ కామినేని నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Jaya Prakash Reddy song for Naveen Chandra's ‘LOL’

దర్శకుడు మాట్లాడుతూ...రాజమౌళి, కీరవాణి గారితో ఉండటం వల్ల నేను పర్ ఫెక్టుగా తయారయ్యాను. మనకు తెలియకుండా కొన్ని లక్షల కోట్లు లక్షల కోట్లు పడి ఉన్నాయి. అదేంటనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అందరికి నచ్చే విధంగా ఉంటుంది అన్నారు.

మయాఖ క్రియేషన్స్ బ్యానర్లో ప్రసాద్ కామినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్, సంపూర్ణేష్ బాబు, మేల్కోటి, భద్రం, భాను తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు శివశక్తి దత్తా, అనంత శ్రీరామ్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డాన్స్: తార, కృష్ణారెడ్డి, జానీ, సన్నీ, ఫైట్స్: పి.సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఇ. మధుసూదనరావు, నిర్మాత: సాయి ప్రసాద్ కామినేని, రచన, దర్శకత్వం: జగదీష్ తలశిల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X