'మా' కి పోటీ చేయవద్దంటూ ఒత్తిడి తెచ్చారు: జయసుధ బ్లాస్ట్

By Srikanya

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) లోనూ రాజకీయ ప్రమేయాలున్నాయని జయసుధ అన్నారు. ఫిలింఛాంబర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆమె అధ్యక్షపదవికి పోటీ చేయవద్దని నేతలతో ఒత్తిడి చేయించారన్నారు. తనపై విమర్శలవల్లే 'మా' అధ్యక్షపదవికి పోటీపడుతున్నానన్నారు. రాజకీయాల్లో ఓటమిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సంపాదించానని, రాజకీయ అనుభవంతో 'మా'కోసం కృషిచేస్తానని ఆమె తెలిపారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడానికి ఒకసారి మహిళకు అవకాశమివ్వాలని గతేడాది జయసుధ కోరారని 'మా' ప్రస్తుత అధ్యక్షుడు మురళీ మోహన్‌ తెలిపారు. ఫిల్మ్‌ఛాంబర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ అందరికన్నా జయసుధ సీనియర్‌ అని, 43 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నారని, 5 భాషల్లో నటించారని మురళీమోహన్‌ పేర్కొన్నారు.

అన్నివిధాలా అర్హురాలనే జయసుధను 'మా' అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదించామన్నారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం మా తరఫున అనేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మురళీమోహన్‌ తెలిపారు. సినీ కార్మికులకు సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నామని, పేదకార్మికులకు మందుల ఖర్చులు అందిస్తున్నామని మురళీమోహన్‌ తెలిపారు. గతేడాది 250 మందికి వైద్యచికిత్సలు చేయించామన్నారు. కార్మికులందరికీ ఆరోగ్య కార్డులు ఇచ్చామన్నారు.

సినీ పెద్దలు, సంఘ సభ్యులు తనకు సహకారం అందిస్తున్నందునే ‘మా' అధ్యక్షునిగా ఉండేందుకు నిర్ణయించుకున్నానని రాజేంద్రప్రసాద్‌ ఈ నెల 2న పత్రికా సమావేశంలో ప్రకటించారు. ముప్పై ఏడేళ్లుగా సినీ రంగంలో ఉన్న తాను, ఇదే రంగంలో ఉన్న కళాకారులకు ‘మా' అధ్యక్షుడిగా తన వంతు సేవ అందించాలనుకుంటున్నానని తెలిపారు.

Jaya Sudha about Maa elections
‘‘సేవా దృక్పథంతో ముందుకెళ్లాలనే కమిట్‌మెంట్‌తో, ఇది సరైన సమయమనే ఉద్దేశంతో, అందరికీ ఇష్టుడిగా, నా బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తాననే నమ్మకంతో ‘మా' అధ్యక్షుడిగా నిలబడబోతున్నా'' అని ఆయన చెప్పారు. గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో తల్లిలాంటి ‘మా'కు సొంత భవనం ఏర్పాటుచేయడమే తన ధ్యేయమన్నారు. కాగా, ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్‌ ఇష్టపడనందునే రాజేంద్రప్రసాద్‌ను ఏకగ్రీవం చేయాలని ‘మా' సభ్యుల్లో కొంతమంది భావించారు.

నాగబాబు, శివాజీరాజా, కాదంబరి కిరణ్‌, ఏడిద శ్రీరామ్‌ వంటివాళ్లు వారిలో ఉన్నారు. పోటీ లేకుండా తన ఎన్నిక ఏకగ్రీవమైతేనే బరిలో ఉంటానని ఆయన స్పష్టం చేయడంతో, ఆయనకు మద్దతుగా ఉన్న ‘మా' సభ్యులు దానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కొద్ది రోజుల ముందు అధ్యక్షునిగా మంచు విష్ణు పోటీ చేయబోతున్నారంటూ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆ ప్రచారాన్ని విష్ణు ఖండించారు. ప్రస్తుతం తనకున్న కమిట్‌మెంట్ల వల్ల ఆ పదవికి వంద శాతం న్యాయం చేయలేనని, అందుకే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంలేదని.. ఆయన ట్విటర్‌ ద్వారా తెలిపారు.

పైగా అధ్యక్ష ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్‌ నిలబడుతున్నందున ఆయన సీనియారిటీని గౌరవిస్తూ, ఆయనకు మద్దతునిస్తానని కూడా విష్ణు చెప్పారు. దీంతో ‘మా' అధ్యక్షునిగా రాజేంద్రప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికవడమే తరువాయని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి.

కానీ, ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా తెరపైకి జయసుధ వచ్చారు. ఆమెకు మురళీమోహన్‌ మద్దతు తెలపడం ఆసక్తికర పరిణామం. అంటే ‘మా'లోని ఆయన వర్గం జయసుధకు మద్దతుగా నిలిచే అవకాశాలున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X